Home News

ఓడినా అసెంబ్లీలో మార్మోగుతున్న ఆ కీలకనేత పేరు…!

ఆయన ప్రభుత్వంలో మంత్రి కాదు….శాసన సభలో సభ్యుడు కూడా కాదు. అయినా నిత్యం అతని పేరు స్మరిస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు కావచ్చు…ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు ఆయనను గుర్తు చేసుకోకుండా అంసెబ్లీ లో ఉండలేకపోతున్నారు. ఇంతకూ ఎవరా నేత….అంతాలా అందరూ తలుచుకోవడం వెనుక కారణం ఏంటి….! ఇంతకూ అంతా తిట్టుకుంటున్నారా…గుర్తు చేసుకుంటున్నారా!

ఎపి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు కీలక అంశాలపై ధాటిగా చర్చలు చేస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్వాకాలను టార్గెట్ చేస్తూ అధికార పక్షం ముందుకు వెళుతుంటే…మీ గొప్పలు ఏంటంటూ ప్రతిపక్షం విరుచుకు పడుతుంది.దీంతో సభ లోపలే కాకుండా సభ భయట కూడా ఆ కాక కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే…..అన్ని పార్టీలనేతలు తలుచుకునే నేతగా మాత్రం మాజీ మంత్రి నారాయణ ఉండిపోతున్నారు. ఎమ్మెల్సీగా చేసి మంత్రి వర్గంలో పని చేసిన పి నారాయణ ను మాత్రం నేతలు రోజూ గుర్తు చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం అసెంబ్లీ భవనంలో ఉన్న అరకొస వసతులే.

గతంలో మంత్రులగా చేసిన వారు…..సుదీర్ఘ కాలం హైదరాబాద్ అసెంబ్లీలో సభలకు హాజరైన వారు ఇప్పుడు సభలో ఉన్న వసతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు మళ్లీ ఐదేళ్ల తరువాత అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరంతా అమరావతిలోని అసెంబ్లీకి హాజరవ్వడం ఇదే ప్రధమం. దీంతో ఇక్కడ అసెంబ్లీ భవన నిర్మాణం, అందులో ఉన్న సదుపాయాలు చూసి షాక్ అవుతున్నారు. ముఖ్యంగా మంత్రులు కూర్చోడానికి చాంబర్లు లేకపోవడం పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరుకుగా ఉండే కారిడార్, అసౌకర్యంగా ఉండే క్యాంటీన్ పైనా సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇలా రూంలు, సౌకర్యాల గురించి చర్చ వచ్చిన ప్రతి సారీ వారు మాజీ మంత్రి నారాయణను తలుచుకుంటున్నారు. తాత్కాలిక భవనాల పేరుతో ఇంత అసౌకర్యంగా నిర్మాణం చెయ్యాల్సిన అవసంర ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం సభ్యులు, అమాత్యులు వాష్ రూం కు వెళ్లాలంటే కూడా సరిగా వసతులులేకపోవడం పై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి నుంచి 2014 లో అసెంబ్లీ కి వచ్చిన సభ్యులు ఇక్కడ సదుపాయాల పట్ల అవగాహన ఉన్నా….కొత్తగా సభకు వచ్చిన వారు మాత్రం ఇక్కడ పరిస్థితి చూసి అవాక్కావుతున్నారు.

వేల ఎకరాల ప్లేస్ పెట్టుకుని నాటి మంత్రి నారాయణ ఇంత ఇరుగ్గా ఇందుకు అసెంబ్లీ కట్టాల్సి వచ్చిందో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మహిళా మంత్రులు, సభ్యుల కష్టాలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. వారి కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో వారంతా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అప్పట్లో అసెంబ్లీ తో పాటు సచివాలయ భవనాలు యుద్ద ప్రతిపదికిన నిర్మించారు. 8 నెలల కాలంలో పూర్తి చెయ్యాలని పరుగులు పెట్టించారు. దీంతో ప్లానింగ్ తో పాటు ఇతర అంశాల్లో తప్పిదాలు జరిగాయి. దీంతో సభ జరుగుతున్న సమయంలో నిత్యం ఏదో ఒక సందర్భంలో దీనిపై చర్చ వస్తోంది. ప్రతిపక్షాన్ని ఇరకున పెట్టాలనుకుంటున్న అధికార పక్షం సభలో కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు.

ఏ మాత్రం గాలి, వెలుతురు లేకుండా నిర్మించిన ఈ అసెంబ్లీ వల్ల ఇక్క ఉండే ఉద్యోగులు ఆనారోగ్యం పాలవుతున్నారని ఆర్ధిక మంత్రి సభలోనే చెప్పారు. ఏది ఏమైనా సభలో లేకపోయినా…నిత్యం మాజీ మంత్రి నారాయణ గురించి మాత్రం అధికార ప్రతిపక్ష సభ్యులు చర్చించుకుంటేనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here