Home News

మాజీ మంత్రికే దక్కని సొంత పార్టీ నేతల ఓదార్పు…!

ఒకప్పుడు ఆయన చుట్టూ అందరూ తిరిగారు … పార్టీకోసం ఆయన కూడా అంతే కష్టపడ్డారు .. అయితే ఇప్పుడు ఆయన ఎవరికి కాకుండా పోయారు.. ఓ వెలుగు వెలిగిన ఆ నాయకుడు కొంత కాలంగా కనిపించకపోయినా … ఏమయ్యారన్న ఆలోచన కూడా చేయడంలేదు … పక్కపార్టీల వారు శ్రద్ద చూపిస్తున్నా… సొంత పార్టీ నేతలు ఆయన గురించి పట్టించుకోవడం లేదు .. దాంతో సీనియర్ నాయకుడి పరిస్థితే అలా ఉంటే… కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తారన్న నిర్వేదం కనిపిస్తోంది హస్తం పార్టీలో…

ఒకప్పుడు గ్రేటర్ కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన నేతల్లో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఒకరు… రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్లో ఉన్న హేమాహేమీ నాయకులు చాలా మంది పదవుల కోసం హస్తానికి హ్యాండ్ ఇచ్చి గులాబీ గూటికి చేరారు .. అయితే ముఖేష్ గౌడ్ మాత్రం ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు… అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నుంచి పార్టీలో చేరాలనే ఆఫర్లు వచ్చినా ఆయన మాత్రం హస్తాన్ని వీడకుండా తన లాయల్టీ చాటుకున్నారు …

తనకు గుర్తింపు నిచ్చిన పార్టీలోనే చివరి శ్వాస వరకు కొనసాగుతానని చెప్తుంటారు ముఖేష్‌గౌడ్‌ … ప్రస్తుతం ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ .. చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు .. ఆయన ఆ స్థితిలో ఉంటే పార్టీ నేతలు కనీసం పరామర్శకు కూడా రాకపోవడంపై ముఖేష్‌గౌడ్‌ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది..

తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఓటమి పాలవ్వడంతో 2014ఎన్నికల తర్వాత ముఖేష్ గౌడ్ సైలెంట్ అయిపోయారు… 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆత్మీయ సమ్మేళనం , ఇంట్లో సీనియర్ నాయకుల భేటి నిర్వహించి కాస్త జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు … కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి మళ్లీ ఆయన ఎక్కడా కనిపించకుండా పోయారు.. దాంతో ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనేది కూడా పట్టించుకోలేదు పార్టీ… అసెంబ్లీ ఎన్నికల తర్వాత మంచం పట్టిన ముఖేష్ ని అలా విస్మరించారు కాంగ్రెస్‌ పెద్దలు.

ముఖేష్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే గత ఏడు మాసాలుగా నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు.. నోటి కేన్సర్, కంటి కేన్సర్ తో బాధపడుతున్న ఆయనకు ఇప్పటికే ఏడు సర్జరీలు చేశారట… అయినప్పటికీ అతని కండీషన్ మాత్రం ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది… ఏడు మాసాలుగా ఆయన కన్ను కూడా తెరవలేదంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు… వైద్యులు మాత్రం కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారట…

ఏడూ నెలలుగా ముఖేష్‌గౌడ్‌ బెడ్‌ మీదనుంచి కదలలేని స్థితిలో ఉంటే .. తెలంగాణ పిసీసీ ముఖ్య నాయకులు ఏమిటి? ఏమైందని? తెలుసుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. .. పార్టీ ముఖ్యులు కానీ… సీఎల్పీ నాయకులు గాని ఆయన కుటుంబాన్ని పలకరించిన పాపానపోలేదట… ఆస్పత్రికి వెళ్లీ పరామర్శించలేదట… ముఖేష్‌గౌడ్‌కు సన్నిహితులైన కొందరు నాయకులు మాత్రం కలిసి వచ్చారట.. ఇక చాలా మంది టీఆర్ఎస్, బీజేపీ నేతలతోపాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ముఖేష్ గౌడ్ ను పరామర్శించారు.

ఏదేమైనా సొంత పార్టీ నేతలు కన్నెత్తి చూడకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… అంతటి నాయకుడినే పార్టీ నేతలువిస్మరించినట్లు వ్యవహరించడంపై ముఖేష్‌గౌడ్‌ అనుచరులు ఫైర్‌ అవుతున్నారు.. అలాంటి నాయకులు ఇక సాధారణ కార్యకర్తలను ఏం పట్టించుకుంటుందని ప్రశ్నిస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here