Home News

కాంగ్రెస్ కి షాకిస్తున్న ఈటలరాజేందర్‌

అసైన్డ్ భూముల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలతో మంత్రి ఈటల రాజేందర్‌ ను సీఎం కేసీఆర్‌ తెలంగాణ కేబినెట్‌ నుంచి తొలగించారు. ఈటల బర్తరఫ్ తర్వాత విపక్ష పార్టీల నుంచి ఆయనకు మద్దతు లభించింది. ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే పనిలో ఉన్న ఈటల అనుచరులతో సమావేశమవుతూ కొత్త పార్టీ,రాజీనమా ఇతర అంశాల పై చర్చిస్తున్నారు. ఇదే సమయంలో పలు పార్టీల నేతలు ఈటలని కలిసి మద్దతు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ కి చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటలను కలిసి సంఘీభావం తెలుపగా టీఆర్ఎస్ కి చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలకు మద్దుతు తెలిపారు. తాజాగా కాంగ్రెస్ కి చెందిన మరికొందరు నేతలు ఈటలను కలవడం సంచలనంగా మారింది.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ‍్వేశర్‌ రెడ్డి ఈటలతో భేటీ కాగా.. కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ కూడా ఈటలతో భేటీ అయ్యారు. ఈటల నివాసాంలో రెండు గంటలకు పైగా భేటీ అయిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ భవిష్యత్ కార్యచరణ పై చర్చించారు. రాములు నాయక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం,వరంగల్ స్థానం నుంచి బరిలో దిగారు. కానీ ఆశించిన మేరకు ఓట్లు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలే తన ఓటమికి సాయం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో మరికొందరు కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈటలకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. సాగర్ లో కాంగ్రెస్ ఓటమి..పీసీసీ చీఫ్ పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్నారు..వీరంరా రాజకీయ ప్రత్యామ్నాయంగా ఈటల వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here