Home News

భట్టి..డీఎస్ ఈటల వరుస భేటీలు దేనికి సంకేతం ?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన రాజకీయ పయనం పై వేగంగా పావులు కదుపుతున్నారు. నిన్న సీఎల్పీ నేత భట్టీతో భేటీ అయిన ఈటల నేడు టీఆర్ఎస్ అసమ్మతి నేత రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల పై డీఎస్ తో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తండ్రి డీఎస్‌తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్‌ కూడా పాల్గొన్నారు.

భూ వ్యవహారంలో ఈటల మంత్రి పదవి కోల్పోయిన తర్వాత పలువురు నేతలు ఇప్పటికే ఈటలకు సంఘీభావం తెలిపారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో పాటు కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా ఈటలకు మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు టీఆర్‌ఎస్ అసమ్మతి నేత రాజ్యసభ సభ్యుడు డీఎస్ తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.మరో వైపు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

ఇక నియోజకవర్గ నేతలతో భేటీ అవుతున్న ఈటల త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డితో కూడా భేటీ కావాలని ఈటల యోచిస్తున్నట్లు తెలుస్తుంది. హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పై యుద్దం ప్రకటిస్తారని అదే సభలో రాజీనామా ప్రకటన చేస్తారన్న చర్చ జరుగుతుంది.ఈ సభకు ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here