Home News

బీజేపీలో చేరిక పై క్లారిటీ ఇచ్చిన ఈటల..రాజీనామా ఎప్పుడంటే ?

రేపు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నఈటల రాజకీయ కార్యచరణ ప్రకటించే దిశగా అడుగులేస్తున్నారు. వచ్చే వారం ఢిల్లీ లో బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా సమక్షంలో బిజేపి లో చేరనున్న ఈటల ఎల్లుండి జూన్ 4న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే గా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించనున్నారు ఈటల.

ఈటల రాజీనామా అనంతరం వచ్చే ఉపఎన్నిక పై కూడా బీజేపీ వ్యూహాలని సిద్దం చేస్తుంది. రాజీనామా తదనంతర పరిణామాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు వ్యూహ రచన ఖరారు చేయనున్నారు బిజేపి రాష్ట్ర నేతలు. ఈరోజు అరగంటకు పైగా బీజేపి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ సంతోష్ తో చర్చలు జరిపిన ఈటెల, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, వివేక్ వేంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కర్నాటక తర్వాత తెలంగాణ లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న బీజేపి అగ్రనాయకత్వం ఆ దిశగా అడుగులేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here