Home News

బీజేపీ అగ్రనేతలతో ఈటల కీలక సమావేశం..కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్

బీజేపీ అగ్ర నేతలతో ఈరోజు సాయంత్రం మాజీమంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా నివాసంలో జరుగనున్న కీలక సమావేశంలో మాజీ మంత్రి ఈటలతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలను వీరు బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకురానున్నారు.

తెలంగాణ లో అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర బిజేపి లో తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించే అంశం పై వీరి మధ్య చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. ఈటల బీజేపీ నాయకత్వం ముందు తన డిమాండ్లు కొన్ని ఉంచినట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు,అవగాహన భవిష్యత్ లో ఉండకూదని..వెనుకబడిన వర్గాలకు చెందిన సమర్థవంతమైన నాయకులకు పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించాలని నడ్డాను ఈటల కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజేపి ని రూపొందించేందుకు అవసరమైన ప్రణాళికను వీరి ముందు మాజీ మంత్రి ఈటల ఉంచనున్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here