Home News

బ్రేకింగ్: ఢిల్లీకి ఈటల..బీజేపీ పెద్దలతో భేటీ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి,మాజీ ఎంపీ వివేక్ ఢిల్లీ వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఈటల బీజేపీలో చేరతారన్న ప్రచారంతో ఢిల్లీ ప్రయాణానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నేత బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ కిషన్‌రెడ్డి కూడా రేపు ఢిల్లీ వెళ్తారని తెలుస్తుంది. మంత్రి పదవి నుంచి ఈటలను తొలగించిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ అండ్ బ్యాచ్ ఈటలకోసం గట్టి ప్రయత్నమే చేసింది. అయితే కాంగ్రెస్ లో మరో వర్గం ఉత్తమ్,జగ్గారెడ్డి ఇతర సీనియర్లు మాత్రం దీనిపై పెద్ద ఆసక్తి చూపలేదు.

ఈటలను చేర్చుకునేందుకు మొదట నుంచి బీజేపీ నేతలు గట్టి ప్రయత్నలే చేశారు. రాష్ట్రానికి చెందిన అగ్రనేతలు బండి సంజయ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చోరవ తీసుకుని ఈటలతో చర్చలు జరిపారు. ఈటల వ్యక్తిత్వం, ప్రజాదరణకు సంబంధించిన నివేదికలు జాతీయ నాయకత్వం తెప్పించుకున్నట్లు సమాచారం. ఈటల కూడా ఉద్యమ కారుడే. ఆయనకు అండగా నిలిచి న్యాయం చేయాలి అన్న వాదన బండి సంజయ్ సైతం పార్టీ పెద్దల వద్ద గట్టిగా వినిపించారు. ఇక ఈటల ఢిల్లీ పయనమవ్వడంతో పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి కమలం పార్టీలో చేరడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. రేపు ఈటలతో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలవనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here