హుజురాబాద్ లో ఈటల విజయం సాధిస్తే తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారతాయన్నారు రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాశరావు. ఈటల విజయం సాధిస్తే సహారా ఈఎస్ఐ స్కాం మొదలు కొందరు కీలక టీఆర్ఎస్ నేతల పై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ తెలంగాణలో దూకుడు పెంచి టీఆర్ఎస్ ను మరింత డిఫెన్సులో పడేస్తుందన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలోకి భారీగా చేరికలుంటాయన్నారు.
ఉపఎన్నికలో ప్రలోభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయన్న గోనె సాగర్ ఉపఎన్నికను మించి హైడ్రామా నడుస్తుందన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం ఈటలకు కొంత అనుకూలంగా ఉంటుందన్నారు.