Home News

బీజేపీలో ఈటల చేరిక ముహుర్తం ఫిక్స్..వెంట నడిచే నేతలు వీరే..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారయింది. ఈ నెల 14న ఆయన కమలం గూటికి చేరనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు. కేసీఆర్ మంత్రి పదవి నుంచి ఈటలను తొలగించిన తర్వాత ఏపార్టీలో చేరతారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. విపక్ష పార్టీల నేతలతో వరుస భేటీల తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపి పెద్దలని కలిశారు ఈటల.

ఎమ్మెల్యే పదవికి సైతం ఈటల రాజీనామా నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఈటలను రాజకీయంగా ఒంటరిని చేసే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ అమలు చేస్తోంది. ఇక ఈటల పాటు ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరే నేతల్లో కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ,మాజీ ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ గూటికి చేరనున్నారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేరిక పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here