Home Videos

ఈటల రాజీనామా..కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని..ఇంకా ప్రగతిభవన్‌ లో బానిస లా బతకలేనని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ హయాంలో మంత్రులకు , అధికారులకు స్వేచ్ఛ లేదని ఈటల అన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈటల తెలిపారు.

హరీష్‌రావు తనకంటే కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అన్నారు ఈటల. సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌ ఒక్కరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. పదవులకోసం ఏనాడు తాను పాకులాడ లేదని ఐదేళ్ల నుంచి కేసీఆర్ తనపై వివక్ష చూపుతున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here