Home News

కొత్త పార్టీ పై క్లారిటీ ఇచ్చిన ఈటల..కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చే పని ఏనాడు చేయలేదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ బలప్రయోగం చేస్తున్నారన్నారు. పథకం ప్రకారమే తనపై కుట్ర చేశారని కొన్ని మీడియా చానళ్లను ఉపయోగించుకుని తాను వేలకోట్ల దోపిడి చేశానంటు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై తన నియోజకవర్గ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.

కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. పార్టీ పెడతానని, మారతానని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేసీఆర్ శిష్యుడిగానే తాను రాజకీయంగా ఎదిగానన్నారు. కేసీఆర్ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందన్నారు ఈటల. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. నా పై వచ్చిన ఆరోపణలపై కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు. తనను సోదరుడిగా చెప్పుకునే కేసీఆర్ నన్ను మానసిక వేదనకు గురిచేశారన్నారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. మీ వ్యవసాయ క్షేత్రంలో రోడ్లు ఎన్ని గ్రామాల నుంచి వేశారని ఆయన ప్రశ్నించారు.

పార్టీ భీఫామ్ కంటే ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన సాధరణ ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని ఈటల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. ఏనాడు పార్టిని దిక్కరించలేదన్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here