మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలంలో ఈటల పడిన ఇబ్బందుల నుంచి ఆర్దరాత్రి దుబాయ్ నుంచి అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నయీం బెదిరింపుల వరకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇంతవరకు పొలిటికల్ గా ఎప్పుడు లైమ్ లైట్ లో లేని జమున ఈటల రాజీనామా అనంతరం ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఒక్క ప్రెస్ మీట్ తోనే అనుభవం ఉన్న నేతలా మాట్లాడారు.