Home News Stories

యుగాంతం 2036లోనా?2068లోనా?

యుగాంతం. ఎప్పట్నించో వింటూ వస్తున్న మాట యుగాంతం. ఓ యుగం అంతమైపోవడమంటే మాటలు కాదు. అది జరుగుతుందో లేదో తెలీదు. చంద్రమండలం మీద ఆవాసం ఏర్పరుచునేంత స్థాయిలో వైజ్ఙానికంగా ఎదిగినా…యుగాంతం అనే మాట మాత్రం అప్పుడప్పుడూ అందరినీ ఉలిక్కిపడేలా చేస్తూనే ఉంది. ప్రపంచం అంతమైపోతుందన్న ప్రచారం ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉంది. మరోవైపు ఎన్ని విపత్తులొచ్చినా మానవ జీవన చక్రం అవిశ్రాంతంగా సాగిపోతూనే ఉంది.

భూమివైపు గ్రహశకలాల రాకపోకలు సర్వ సాధారణం. 2020లో కరోనా సహా ఎన్నో విపత్తులు రావడంతో… మళ్లీ యుగాంతమనే మాట తెరపైకొచ్చింది. నవంబర్ 2న యుగాంతం వస్తుందనీ… భూమి ముక్కలవుతుందనీ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రచారం జరిగింది. కేవలం ఊహాజనిత ప్రచారమేమీ కాదు. దానికో బలమైన కారణం కూడా చూపించారు. 2018VPవన్‌ అని పిలిచే గ్రహశకలం నవంబర్ 2న భూమివైపు వచ్చి వెళ్లిపోయింది. ఆ అస్టరాయిడ్‌ భూమిని ఢీకొట్టి ఉంటే ఏ స్థాయిలో ఉత్పాతం సృష్టించి ఉండేదోకానీ… తన దారిన తాను వెనక్కి వెళ్లిపోయింది. ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టకపోవడంతో గండం గడిచినట్లేనని ఊపిరి పీల్చుకుంటుంటే…ఆశ దోశ అప్పడం అంటూ.. యుగాంతానికి మరో కొత్త డేట్‌ ఫిక్స్ చేశారు.

నవంబరు 2న వచ్చిన గ్రహశకలాన్ని అమెరికాగ కాలిఫోర్నియాలోని… పల్మొనార్ అబ్జర్వేటరీ నాలుగేళ్ల ముందు…అంటే 2016లోనే గుర్తించింది. ఈ గ్రహశకలం పొడవు ఆరున్నర అడుగులు. ఈ అస్టరాయిడ్‌ వేగం గంటకు 40వేల కిలోమీటర్లు. అంటే సెకండ్‌కి 11.11 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. పెనువేగంతో దూసుకొచ్చి గ్రహ శకలం భూమిని ఢీకొంటే వచ్చేది పెను ప్రళయమే. అదృష్టవశాత్తూ ఆ ముప్పు తప్పినా మళ్లీ రాదనే గ్యారంటీ ఏమీ లేదు. అందుకే ఆ యుగాంతానికి మరో కొత్త తేదీని తెరపైకి తెచ్చారు అపరమేథావులు.వాళ్లు చెప్పే కొత్త ముహూర్తం 2029 ఏప్రిల్ 13. ఆ తేదీకి కూడా ఓ లాజిక్‌ ఉందంటున్నారు. భారీ గ్రహశకలం అపోఫిస్… 2029లో ఏప్రిల్ 13న భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని అంచనావేశారు శాస్త్రవేత్తలు.

అఫోసిస్‌ గ్రహశకలానికి గాడ్ ఆఫ్ చావోస్ అనే ఈజిఫ్ట్ దేవుడి పేరు పెట్టారు.అది ఢీకొంటే భూమి మట్టి కుండలా ముక్కలైపోవడం ఖాయమంటున్నారు.
నవంబరు 2న భూమికి చేరువగా వచ్చిన అస్టరాయిడ్‌ తో పోలిస్తే.. అపోఫిస్ గ్రహశకలం చాలా పెద్దది. 11వందల అడుగుల పొడవున్న అఫోసిస్‌ గ్రహశకలం భూమిని ఢీకొట్టిందంటే 15వేల అణుబాంబుల శక్తి విడుదలవుతుంది.ఒక్క ఆటంబాంబుకే ఓ రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అలాంటిది 15వేల అణుబాంబులంటే … భూమండలమే బుగ్గయిపోతుంది. అయితే దానిగురించి అంత టెన్షన్‌ పడాల్సిన పన్లేదనే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. భూమికి 37,599 కిలోమీటర్ల దూరం నుంచీ వెళ్లే ఆ గ్రహశకలంతో పెద్ద ప్రమాదమేమీ ఉండకపోవచ్చంటున్నారు.

అయితే 2029లో అపోఫిస్ గ్రహశకలం మనకు కనిపిస్తుంది. ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవంటున్న నాసా…దాని మార్గాన్ని కచ్చితంగా అంచనా వెయ్యలేమంటోంది. ఒకవేళ 2029లో అనుకున్నతేదీకి ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టకపోతే… 2036లో లేదంటే 2068లో అదే గ్రహశకలం భూమిని ఢీకొడుతుందనేది మరో అంచనా. 2065 తర్వాత యుగాంతం వస్తుందని… ఫ్రాన్స్ జ్యోతిష శాస్త్రవేత్త నోస్ట్రడామస్ చెప్పిందే జరగొచ్చని వాదిస్తున్నారు మరికొందరు. మొత్తానికి యుగాంతం అనే మాట ఈ ప్రపంచాన్ని జయించానుకునే మనిషికి ఎప్పటికప్పుడు కొత్త సవాలు విసురుతూ…జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here