Home News

అప్పుడు మినిస్టర్ ఛాన్స్ మిస్…ఇప్పుడు సీటే గల్లంతు…!

గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉండేది… అధినేత హమీ కూడా ఇచ్చారు… అందులోభాగంగానే తనను ఈసారి గెలిపిస్తే మంత్రి పదవి వస్తుందని ప్రచారం కూడా చేసుకున్నారు… కాని బ్యాడ్ లక్ ఓడిపోయారు … పుండు మీద కారం చల్లినట్లు ఇప్పుడు ఆయనపై గెలిచిన ఎమ్మెల్యే వచ్చి పార్టీలో చేరిపోయారు .. దాంతో ఆయనకు పార్టీ పరంగా గుర్తింపు లేకుండా పోయిందంట.. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఆ నేతకు పుస్తకాలు కూడా అందలేదంట … అన్ని విషయాల్లో కొత్త చేరిన ఎమ్మెల్యేకే ప్రయార్టీ లభిస్తోందంట .. అసలు పార్టీ నాయకత్వం సదరు నేతను ఎందుకు పక్కన పెట్టింది?కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి… ఒకప్పుడు బద్ద శత్రువులుగా వున్నవారు ఇప్పుడు ఒక గూటికి కింద ఇమడాల్సి వస్తోంది … అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నల్లమడుగు సురేందర్ పోటీ చేయగా… టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఏనుగు రవీందర్ రెడ్డి పోటిచేశారు… వరుసగా పోటీ చేస్తున్నా ఓడిపోతుండటంతో .. సురేందర్‌కు సానుభూతి వర్కౌట్‌ అయింది.. దాంతో ఏనుగు రవీందర్‌రెడ్డి పరాజయం పాలయ్యారు.. ఇక గెలిచిన కొద్ది రోజులకే సురేందర్ హస్తం పార్టీకి హ్యండ్ ఇచ్చేసి కారెక్కేశారు….సురేందర్ టిఆర్ఎస్‌లో చేరడంపై ఏనుగు రవీందర్ రెడ్డి గుర్రుగా వున్నారట… ఇంతకాలం తనకు ప్రత్యర్థిగా వున్న వ్యక్తి పార్టీలో రావడం ఆయన జిర్ణించుకోలేకపోతున్నారట… మరోవైపు పార్టీపరంగా సురేందర్‌కే ప్రాధాన్యత లభిస్తుండటం ఆయనకు అసలు మింగుడు పడటం లేదంట … కనీసం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలు సైతం ఏనుగు రవీందర్‌రెడ్డికి ఇవ్వలేదట… దాంతో అలకపాన్పు ఎక్కిన ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు …


పార్టీ తనను ఒంటరి వాడిని చేసిందని సన్నిహితులతో చెప్పుకోని తెగ బాధపడిపోతున్నారట ఏనుగు రవిందర్ రెడ్డి… ఈసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందనుకోని ఆశపెడితే ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాని తన ఆవేదనను వెల్లబోసుకుంటున్నారట.. వాస్తవానికి రవీందర్ రెడ్డి ఓటమి వెనుక సొంత పార్టీ నేతలు, క్యాడర్ పాత్ర వుందంట… రవీందర్ రెడ్డికి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్‌ నేతలే ప్రచారం చేశారంట.. ఎన్నికల ఫలితాల తర్వాత రవీందర్ రెడ్డి ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి సైతం తీసుకువెళ్లారు… అయితే ఆయన కంప్లైంట్‌ను పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు..

పార్లమెంట్ ఎన్నికల సమయంలో జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన కేటిఆర్ సభతో పరిణామాలు అన్ని పూర్తిగా మారిపోయాయి… జహిరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఒక ఎల్లారెడ్డి నియోజకవర్గం మినహా మిగత అన్ని చోట్ల టిఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు… ఆ సభలో కేటీఆర్‌ అందరు ఎమ్మెల్యేల పేరు ప్రస్తావించినప్పుడు కార్యకర్తలు చప్పట్ల వర్షం కురిపించగా… ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవిందర్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చినప్పుడు ఎటువంటి స్పందన కనపడలేదు …


అది గ్రహించారో ఏమో కేటిఆర్ కార్యకర్తలెవరు అధైర్యపడవద్దని… పోయిన చోటే వెతుక్కుందామని వ్యాఖ్యానించారు .. దాంతో సురేందర్ టిఆర్ఎస్‌లో చేరిక ఇక లాంఛనమే అని ప్రచారం జరిగింది … దానికి తగ్గట్లే సురేందర్ కాంగ్రెస్‌ను వీడి గులాబీగూటికి చేరిపోయారు … దాంతో సహజంగానే రవీందర్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.. ఇటు క్యాడర్ సైతం రెండు గ్రూపులుగా చీలిపోయింది…. ఆ ఎఫెక్ట్‌ రిఫ్లెక్ట్‌ అయి పార్లమెంట్ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టిఆర్ఎస్‌కి మోజార్టీ రాలేదు…

అంతేకాదు పరిషత్ ఎన్నికల్లో సైతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండు జడ్పీటిసి స్తానాలలో గెలుపొందింది.. దాంతో సురేందర్ ఎక్కడ బలోపేతమవుతారో ఆన్న ఉద్దేశ్యంతో రవీందర్ రెడ్డి సహకరించడంలేదన్న టాక్ వినిపిస్తోంది … మొత్తమ్మీద వారిద్దరి ఆధిపత్యపోరుతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది.. ఆ ఎఫెక్ట్‌ పార్టీ పరంగా సురేందర్ కంటే రవీందర్‌ మీదే ఎక్కువ పడుతుందంటున్నారు .. అందులోభాగంగానే రవీందర్‌రెడ్డిని టిఆర్ఎస్ పూర్తిగా పక్కన పెట్టేసిందన్న ప్రచారం సైతం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది…

జహిరాబాద్ ఎంపి టికెట్ తెచ్చుకుని మళ్లీ ఫాంలోకి రావాలని ఏనుగు రవీందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు వర్క్‌అవుట్‌ కాలేదు … చివరికి ఎమ్మెల్సీ పదవి అయిన దక్కుతుందనుకుంటే అదికూడా జరగలేదు … కార్పొరేషన్ పదవిలాంటివి కూడా వచ్చే పరిస్థితులు లేవని ఆయన వాపోతున్నారంట.. వచ్చే ఎన్నికల్లో రవీందర్ రెడ్డికి టికెట్ వచ్చే పరిస్థితులు కనబడంలేదన్న ప్రచారం జరుగుతుంది… సురేందర్ పార్టీలో చేరి తన సీటునే గల్లంతు చేశారని ఏనుగు రవీందర్ రెడ్డి తెగ బాధపడిపోతున్నారట…. మొత్తమ్మీద ఆయన పరిస్థితి అటుఇటు కాకుండా తయారైంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here