Home News

ఏపీ,తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ బ్రేక్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్రేక్ పడింది. కరోనా సెకండ్ వేవ భారీగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పరిస్తితి కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నికల పై నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు ఈ నెలలో జరగాల్సి ఉంది.

తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల జూన్ 3న పూర్తవుతోంది. అలాగే ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మే 31తో పదవి కాలం పూర్తవుతుంది. ఖాళీ అవుతున్న స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అందరూ భావించారు. ఈసీ నిర్ణయంతో పదవుల పై ఆశ పెట్టుకున్న నేతలు ఊసురుమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here