Home News Updates

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు: ఈటెల

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలుతీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనాపై జరిగిన సమావేశంలో ఏమాట్లాడారో చూడండి:

శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం.

ప్రత్యేక ఆసుపత్రి ని కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయం.

9 డిపార్ట్మెంట్ ల సమన్వయంతో పనిచేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక నోడల్ ఆఫీసర్.

ఊపిరితత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటాం.

ప్రైవేట్ హాస్పిటల్స్ ను కూడా అప్రమత్తం చేస్తున్నాం
కరోనా అనుమానం ఉన్న రోగులకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించండి అని కొరినం.

ప్రజలకు విశ్వాసం కలిగించడం మన బాధ్యత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here