నోవెల్ కరోనా వైరస్ పై బులిటెన్ విడుదల చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అయన చెప్పిన దాని ప్రకారం…

ఈరోజు సాయంత్రం వరకు ఆసుపత్రుల్లో చేరిన 15 కేసుల్లో.. 9 కేసుల్లో కరోనా వైరస్ లేవని పరీక్షలు నిర్ధారణ అయ్యాయి.
2 శాంపిల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం.
4 శాంపిల్స్ ను పుణె కు పంపించాము.
వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. వైరల్ వ్యాధులు సోకినప్పుడు ఉపయోగించే మందును పూర్తిస్థాయిలో అందుబాటు లో ఉంచాము.
హైదరాబాదులో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రెండు రోజుల్లో గాంధీ హాస్పిటల్ లో ఈ పరీక్షలను మొదలు పెడతాం.
ప్రజలు కరోనా వైరస్ గురించి భయాందోళనలు చెందవద్దు. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళవద్దు. దగ్గు వచ్చినపుడు తప్పకుండా చేతులు అడ్డం పెట్టుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
కరోనా వైరస్ కి సంబంధించిన అనుమానాల నివృత్తి కోసం 24 గంటల కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశాము. 04024651119.