Home News

11 వందల కోట్ల లోన్ స్కామ్..ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కాంట్రాక్ట్ పనుల్లో భాగంగా ప్రాజెక్ట్ కోసం మధుకాన్ కంపెనీ రూ.1100 కోట్లు లోన్ తీసుకుంది. అందులో 264 కోట్లు రూపాయలు నిధులు పక్క దారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. 2011లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉంది. దీని పై రాంచీ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ స్కాంపై విచారణ చేయాలని ఇన్వెస్టిగేషన్ అధికారులకు జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నామా ఇంటితో పాటు ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్‌లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంపై నామా నాగేశ్వరరావుతో పాటు రాంచి ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ కె. శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృధ్వీ తేజల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.నిధుల మళ్లింపుపై 2019లో నామాపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2020లో సీబీఐ చార్జీ షీట్ ఫైల్ చేసింది. మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ ప్రాకెక్ట్, మధుకాన్ టోల్ వే, ఆడిటర్లను చార్జీషీట్‌లో సీబీఐ నిందితులుగా చేర్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here