Home Women Health

పాలు పుష్కలంగా తాగండి ఆరోగ్యంగా ఉండండి

పాలు పుష్కలంగా తాగండి ఆరోగ్యంగా ఉండండి పాలు పౌష్టికాహారమన్న సంగతిని మనం తరచూ వింటుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ, రోగాల్ని తగ్గించడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

పాలు పౌష్టికాహారమన్న సంగతిని మనం తరచూ వింటుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ, రోగాల్ని తగ్గించడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన ‘పరిపూర్ణ పౌష్టి కాహారం’కింద చెబుతుంటారు. పాలను మానవులు అనాది నుంచి వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు మొదలైనవి. ఆవుపాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రొటీన్లు ఉంటాయి. కాని చక్కెర తక్కువ ఉంటుంది. బర్రె పాలలో ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది.

ఆహారపు విలువలు

పాలలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్‌లు, మనకు తెలిసిన అన్నిరకాల విటమిన్‌లు, అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలన్నీ లభిస్తాయి. పాలలో లభించే ప్రొటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమినో యాసిడ్స్‌ అన్నీ లభిస్తాయి.
ఒక లీటరు పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం, ఫాస్పరస్‌, పుష్కలంగా విటమిన్‌’ఎ”సి’, మూడోవంతు ప్రొటీన్లు, ఎనిమిదో వంతు ఐరన్‌, నాలుగోవంతు, శక్తి ‘బి’, ‘ఇ’,’డి’విటమిన్లు కొంత లో కొంత లభిస్తాయి.

పాలు పుష్కలంగా తాగండి ఆరోగ్యంగా ఉండండి

పాలలో లభించే కొవ్వులో 99 శాతం, ప్రొటీన్లలలో 97 శాతం, కార్బోహైడ్రేట్లలో 98 శాతం తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి. మనం తాగిన పాలు జీర్ణం కావటానికి గంటన్నర సమయం సరిపోతుంది. పాలలోని లవణాలు, నీరు జీర్ణాశయంలో చేరుకున్న తక్షణమే అబ్జార్బ్‌ కావడం కావడం ప్రారంభిస్తాయి. కాని మిగతా ఘన పదార్థాలు, కొవ్వు మాత్రం ప్రేవులలోకి చేరుకున్న దగ్గరినుంచి అబ్జార్బ్‌ కావటం మొదలెడతాయి.

పాలు-ఉపయోగాలు
ఆనాటి వైద్యరత్న చరకుడు చెప్పిన దానిని బట్టి పాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. అలసటను పోగొడతాయి. సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి. ఆధునిక ప్రయోగాలలో ఆ ప్రయోజనాలన్నీ ఋజువు కాబడ్డాయి. పాలు తాగే పాపాయిల నుంచి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి పనికి వచ్చే ఆహారం పాలు ఒకటేనంటే అతిశయోక్తి కాదు. అస్వస్థతతో బాధపడుతున్న వాళ్ళకు కూడా పాలు చక్కటి ఆహారం కింద ఉపకరిస్తుంది.

కొందరికి పాలు సరిపడవు. అలాంటి వాళ్ళకు పాలు తాగగానే కడుపులో గ్యాస్‌ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరించినట్లుగా అవుతుంది. ఇందుకు కారణం ఏమిటంటే. పాలలో ఉన్న కార్బోహైడ్రేట్ జీర్ణం గావించే లాక్టోస్‌ అనబడే ఎంజైమ్‌ వీళ్ళలో సరిగా ఉత్పత్తి కాకపోవటం! లాక్టోస్‌ సరిగా ఉత్పత్తి కాని మనుషులకు కడుపులో గ్యాస్‌ అధికంగా ఉత్పత్తి కావటం, కడుపు ఉబ్బరించటం, కడుపులో నొప్పి, అజీర్ణం, విరోచనాలు లాంటి ఇబ్బందులు ఎదరవుతాయి.

పాలు తాగగానే లేక పాల ఉత్పత్తి పదార్థాలను తినగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడే వాళ్ళు తమకు తాము ఒక సింపుల్‌ టెస్ట్‌ ను చేసుకోవచ్చు. వీళ్ళు ఒక పది రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవటం మానేసి పై లక్షణాలు తొలగి పోతాయేమో చూడాలి. పాలు మానేయగానే పై లక్షణాలు తొలగి పోయి, తిరిగి పాల ఉత్పత్తులను తీసుకోవటం మొదలు పెట్టగానే మళ్ళీ ఆ లక్షణాలు మొదలైతే తమకు పాలు పడవని అర్ధం చేసుకుని పాలను మానేయాలి. ఇలా పాలు పడని వాళ్ళు శాకాహారులైతే వాళ్ళు తమ ఆహారంలో గుడ్లు, సోయా చిక్కుళ్ళు, మిగతా పప్పు ధాన్యాల ద్వారా తమ శరీరానికి అవసరమైన పాల ద్వారా లభించని ప్రొటీన్లను పొందటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రొటీన్లు తక్కువయితే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడి త్వరగా అతను అంటురోగాల బారినపడే అవకాశం ఉంది.

పాలలో ఔషధోపయోగాలు

లావెక్కడానికి :బక్కగా బలహీనంగా ఉన్న వాళ్ళకు లావెక్కటానికి పనికివచ్చే ఆహారం పాలు! ఉండాల్సిన బరువుకంటే తక్కువ బరువున్న వాళ్ళు సరిపడా పాలు తాగటం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌన్ల దాకా బరువెక్క గలుగుతారు. నిదానం మీద శరీరం బరువు ఉండాల్సిన స్థి తికి వచ్చేస్తుంది. పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది.

రక్తప్రసరణ మెరుగు : శరీరంలో రక్తప్రసరణ సరిగా లేని వాళ్ళకు పాలు అద్భుతమైన ఆహారం! పాలు తాగటంవల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధిచెంది శరీరంలో రక్తప్రసరణ సహ జసిద్ధంగా మెరుగుపడుతుంది.రక్త ప్రసరణ సరిగా లేకపోవటంవల్ల చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రక్తప్రసరణ సజావుస్ధి తికి చేరుకున్నాక ఇవి మళ్ళీ జవాన్ని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు.

కడుపులో వాయువు :కడుపులో యాసిడ్‌ తయారవుతూ హైపర్‌ ఎసిడిటీతో బాధపడే వాళ్ళకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావటానికి యాసిడ్‌ అధికంగా కావాల్సివస్తుంది. పాలలో ఉండే ఆల్కలైన్‌ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్‌ స్థితిని ప్రేరేపించే పరిస్థి తులు చాలా త్వరగా సాధారణ స్థి తికి వచ్చేస్తాయి.

నిద్రలేమి :నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు పరప్రసాదం లాంటివి. నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాలలో తేనెను కడుపుకుని తాగాతే కొన్నాళ్టికి కమ్మని నిద్రకు చేరువవుతారు!

శ్వాస సంబంధ వ్యాధులు :జలుబు, గొంతు బొంగురుపోవటం, ఉబ్బసం, టాన్సిలైటిస్‌, బ్రాంకైటిస్‌ లాంటి వ్యాధులకు పాలు దివ్యౌవషధంలా పనిచేస్తాయి. గ్లాసెడు మరగ కాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని రోజూ రాత్రుల తాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులకు మూడు రోజులలో సత్ఫలితం లభిస్తుంది.

చర్మవ్యాధులు :పాలపైని మీగడలో కొద్దిపాటి వినెగార్‌, చిటికెడు పసుపు కలిపి గాయాలు, పుళ్ళు, గజ్జి మొదలైన వాటిమీద పూస్తే అవి త్వరలోనే తగ్గిపోతాయి.

సౌందర్య సాధనంగా :కాస్మెటిక్స్‌లాంటి సౌందర్య సాధనాలలో కూడా పాలు చక్కగా ఉపకరిస్తాయి. రాత్రులు మరగ కాచిన గ్లాసెడు పాలలో ఒక తాజా నిమ్మకాయ రసాన్ని పిండి పది నిమిషాల తర్వాత చేతులు, మొహం, మెడ, భుజాలకు రాసుకుని ఆరబెట్టాలి. అలాగే పడుకుని మర్నాడు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కొన్నాళ్టికి శరీరంలో మెరుపు, మృదుత్వం వస్తాయి. పచ్చిగుడ్డు సొనను పాలలో కలుపుకుని ప్రతిరోజూ ఆ మిశ్రమంతో తలంటుకంటే జుట్టు పెరగటమే కాదు. ఏరకమైన మాడుకు సంబంధించిన చర్మవ్యాధులు మీ దరి చేరవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here