అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… ఆమె కట్టుకున్న డ్రెస్ ఖరీదు ఎంత వుంటుంది … ఆమె టేస్ట్ ఏమిటి అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి . సాధారణంగానే . తాను స్పెషల్ గా వుండాలని ఆమె కోరుకుంటారు .. అందుకే స్పెషల్ గా తయారు చేయించుకుంటారు . ఇంతకి ఆమె వేసుకున్న ఒక డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా .. ఇండియన్ కరెన్సీ లో అక్షరాలా 1అ లక్ష 70 వేల రూపాయలు

అంతే కాదు మెలానియా ట్రంప్ నడుముకు కట్టుకున్న వస్త్రం ఏమిటి.. దాని ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు మరో హాట్ టాపిక్ … అసలే మోడల్ కదా అందుకే భారత పర్యటన సందర్భంగా ఆమె వైట్ ఔట్ఫిట్లో దర్శనమిచ్చారు. దానితో పాటుగా ఆమె ఆకుపచ్చ రంగులో ఉన్న శాష్( నడుముకు ధరించే వస్త్రం) కట్టుకున్నారు. ఈ శాష్‌ను మెలానియా ట్రంప్ డిజైనర్ హెర్వ్ పియర్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆకుపచ్చ, బంగారపు రంగుతో ఉన్న ఈ వస్త్రాన్ని 20వ శతాబ్దానికి చెందిన ఇండియన్ టెక్స్‌టైల్స్‌తో తయారుచేసినట్టు హెర్వ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చెప్పుకొచ్చాడు.


ప్యారిస్‌లోని తన స్నేహితుల ద్వారా తాను ఈ టెక్స్‌టైల్‌ను సేకరించినట్టు హెర్వ్ తెలిపాడు. అంతేకాకుండా ఈ వస్త్రంలోని బోర్డర్ పీస్ చాలా అరుదైన క్లాత్ అని వివరించాడు.