కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో డీఆర్డీవో తీపి కబురు చెప్పింది. కరోనా బారినపడ్డ వారి ఆరోగ్యం విషమిస్తే అత్యవసర వినియోగానికి గానూ వ్యాక్సిన్ రెడీ చేసింది. దీంతో ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ’ ఔషధాన్ని త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’ మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపింది. ఈ మెడిసిన్ కరోనా స్పెషలిస్ట్ డా.సీఎల్ వెంకట్రావ్ పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో అందించారు.
డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) ఈ ‘2–డీజీ’మందును అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కలిసి ప్రయోగాలు చేసి ఈ మెడిసిన్ అభివృద్ది చేశారు.