Home Health corona

బ్రేకింగ్: DRDO 2-జీ డ్రగ్ విడుదల

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ఔషధం ‘2– డీజీ’ డ్రగ్ తొలిబ్యాచ్‌ విడుదల చేశారు కేంద్రమంత్రులు హర్షవర్ధన్,రాజ్ నాథ్ సింగ్. నోటి ద్వారా తీసుకునే ఈ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడోచ్చన్న డీఆర్డీఏ తెలిపింది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి సైతం లభించింది. ఢిల్లీలోని డీఆర్‌డీవో కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

2–డీఆక్సీ– డీ– గ్లూకోజ్‌ ఓరల్‌ గా తీసుకునే ఈ డ్రగ్ ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని. ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని రక్షణశాఖ తెలిపింది. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను ఈవారంలో అందుబాటులోకి తీసుకురానుంది. దీన్ని ఉపయోగించిన బాధితుల్లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలోనెగెటివ్‌గా తేలిన‌ట్లు డీఆర్‌డీఓ డీసీజీఐకి సమర్పించిన పత్రాల్లో తెలిపింది. పొడి రూపంలో డ్రగ్‌ను నీళ్లలో క‌లుపుకొని తాగితే వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here