కరోనా వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలని గాబారా పడి వెంటనే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదంటున్నారు కరోనా స్పెషలిస్ట్ డాక్టర్ సీఎల్ వెంకట్రావ్. పల్స్ ఆక్సీ మీటర్,ధర్మా మీటర్ దగ్గర ఉంచుకుని డాక్టర్ సూచించిన కొన్ని మందులు వాడితే సరిపోతుందంటున్నారు. ఇక అవసరాన్ని బట్టి సీఆర్పీ,ఎల్ డీ హెచ్,సీబీపీ,సీరం క్రియాటిన్ లెవల్ చెక్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇక సిటి స్కాన్ పరిస్థితిని బట్టి అవసరం అవుతుందన్నారు.
ఇక సరైన నిద్ర,రోజు ఐదు లీటర్ల నీరు,కొబ్బరి నీళ్ళు,నాన్ వెజ్ ఇలా మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుందన్నారు. మంచి ఫుడ్ తో పాటు వెంటిలేషన్ చాలా ముఖ్యమన్నారు. ఈ నియమాలను ఫాలో అయితే ఇక కరోనాకి ఆస్పత్రులతో పని లేదన్నారు.