Home Videos

బ్లాక్ ఫంగస్ వల్ల జరిగే నష్టం ఇదే

అసలే కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే ఇప్పుడు కొత్తగా బ్లాక్​ ఫంగస్​ టెన్షన్ పెడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్​ వంటి రాష్ట్రాల్లో కోవిడ్–19 నుంచి కోలుకున్న వారిలో ముకోర్ మైకోసిస్ అని పిలిచే బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు కంటి చూపును సైతం కోల్పోతున్నారు. ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50% కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ ఈ వ్యాధి గురించి వివరాలను వెల్లడించారు.

ఇది మనుషులకు అరుదుగా సోకే ఫంగల్ ఇన్ఫెక్షన్. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముకోర్మైకోసిస్ ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది తడి ఉపరితలాల నుంచి ఎక్కువగా సోకుతుందని తెలుస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడ్రోజుల్లో బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్​లో చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్​ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయిన చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here