Home News

రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ

అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పూరిగుడిసెలో ఉండే పెద వారి నుంచి పెద్ద బంగ్లాలల్లో ఉండే సంపన్నుల వరకు అందరూ రామయ్య మందిర నిర్మాణానికి సహాయం అందిస్తున్నారు. శతాబ్దాల పోరాట ఫలితంగా ఎన్నో ఒడిదోడుకులు చవి చూసీ ఆకరికి సుప్రీం తీర్పుతో అయోధ్యకు అడ్డంకులు తొలగాయి. దీంతో మందిర నిర్మాణానికి కార్యక్రమాలు మొదలవగా ముందుగా ‘రామజన్మ భూమి తీర్థ క్షేత్ర్’ నిధి సేకరణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10వరకు విరాళాలు సేకరళణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో దేశంలోని గవర్నర్‎లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ రామ మందిరానికి విరాళాలు అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు వారికి తోచినంత విరాళాన్ని ఇస్తూ ఉడత భక్తిని చాటుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై లక్ష రూపాయల విరాళాన్ని రామజన్మ భూమి నిధి అభియాన్ కన్వినర్ బందారి రమేష్ కు అందించారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30లక్షల విరాళాన్ని ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ భరత్ కు అందించారు. అటు వైపు బీజేపీ నేతలు నుంచి కూడ విరాళాలు పెరుగుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ బీజేపీ పార్టీ కోర్ కమిటి సభ్యులు వివేక్ వెంకట స్వామి కోటి విరాళం ఇవ్వగా.. మాజీ ఎంపీ జీతేందర్ రెడ్డి కోటీ రూపాయలు విరాళాన్ని ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యదర్శి భయ్యాజీ జోషీకి అందించారు. అయోధ్య రామమందిర నిర్మాణం అతి త్వరలో పూర్తి కావాలని కోట్లాది ప్రజలు కోరుకుంటున్నట్లు వివెక్ చెప్పారు. కాంగ్రేస్ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మందిర నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళాన్ని.. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కోటీ విరాళాన్ని అందించారు. వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి రూ.6 కోట్లు, రామేశ్వర్ రావు రూ.5 కోట్ల విరాళాన్నిఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here