Home Entertainment Cinema

రామ్ చరణ్ తీరుతో అసంతృప్తిగా ఉన్న చిరంజీవి..

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే రామ్ చరణ్ తీరుతో చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ కెరీర్ మంచి జోష్ మీద ఉంది. రంగస్థలం ఆల్ టైం క్లాసిక్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను వినయ విధేయ రామ అంటూ డిజాస్టర్ ఇచ్చాడు. అయినా కూడా ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తుండటంతో చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ సినిమా చేస్తాడు.. ఈ దర్శకుడితో పని చేస్తాడు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi and Ramcharan

ఈ విషయంలో కొడుకు కెరీర్ గురించి చిరంజీవి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఒకవైపు తన సినిమా చేస్తూనే తన దగ్గరికి వస్తున్న దర్శకులకు రామ్ చరణ్ కోసం కధ సిద్ధం చేయాలంటూ చిరంజీవి సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి, సుజీత్, గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకులు చరణ్ కోసం కథలు సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా రామ్ చరణ్ పూర్తిగా వినలేదని అందుకే చిరంజీవి కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కేవలం రాజమౌళి సినిమాతోనే ఉంటే మరో ఏడాది వరకు కూడా ఈయన నుంచి మరో సినిమా రాదు.

ఇదే సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తర్వాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కన్ఫర్మ్ చేశాడు. రాజమౌళి సినిమా నుంచి బయటకు రాగానే ఈ సినిమా షూటింగ్ తో బిజీ అయిపోనున్నాడు నందమూరి చిన్నోడు. అంతేకాకుండా జనవరిలో రాజమౌళి సినిమాతో సమ్మర్ లో త్రివిక్రమ్ సినిమాతో వస్తున్నాడు జూనియర్. అక్కడ ఎన్టీఆర్ అంత ప్లానింగ్ చేసుకుంటే రామ్ చరణ్ మాత్రం నెక్స్ట్ సినిమా ఏంటి అనేది చెప్పడం లేదు. ఇదే విషయంలో చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే దర్శకులతో కథలు సిద్ధం చేయాలని చెబుతున్నాడు మెగాస్టార్. ఈ విషయంలో చరణ్ మాత్రం కాస్త వెనుకబడ్డారు. మరి తండ్రి బాధను చరణ్ ఎప్పటికీ అర్థం చేసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here