Home Entertainment Cinema

నాగ శౌర్యకు భీష్మతో అదిరిపోయే పంచ్ ఇచ్చిన వెంకీ కుడుముల..

ఇండస్ట్రీలో తెలియకుండానే కొన్ని సార్లు కోల్డ్ వార్ జరుగుతుంది. ఇప్పుడు దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నాగ శౌర్య మధ్య ఇలాంటి యుద్ధమే జరుగుతుంది. ఈ మధ్య అశ్వధ్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శౌర్య. అయితే ఈ సినిమా పెద్దగా అంచనాలు అందుకోలేదు. దీనికి నాగశౌర్య కథ రాశాడు. థ్రిల్లింగ్ సబ్జెక్టుగా వచ్చిన అశ్వద్ధామ స్క్రీన్ ప్లే లోపాలతో పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలోనే ఛలో సినిమా కథ కూడా నాదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే ఆ సినిమాకు పేరు వేసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశానని శౌర్య చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. భీష్మ సినిమా తెరకెక్కించిన వెంకీని మీడియా ఇదే ప్రశ్న అడిగేసరికి.. అలాంటి వాటిని నేను పట్టించుకోను.. ఛలో సినిమా సమయంలో ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్లకు ఇచ్చాను అంటూ ఆన్సర్ ఇచ్చాడు వెంకీ కుడుముల.

అయినా ఇలాంటివన్నీ పట్టించుకుంటూ నేను టైం వేస్ట్ చేయను అంటూ శౌర్యకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన ఈ కుర్ర దర్శకుడు. అయినా కూడా మాటలతో కాకుండా తన సినిమాతో సమాధానం చెప్పాలనుకున్నాడు వెంకీ. ఇప్పుడు విడుదలైన నితిన్ భీష్మ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఒకవేళ నిజంగానే వెంకీ కుడుములలో విషయం లేకపోతే.. చలో సినిమా కథ ఆయన రాయకపోతే.. ఇప్పుడు భీష్మ సినిమా కథ ఇంత అద్భుతంగా రాసేవాడా.. స్క్రీన్ ప్లే ఇంత అందంగా అల్లుకునేవాడా అంటూ నాగశౌర్య ను నేరుగా ప్రశ్నిస్తున్నారు అభిమానులు. విషయం ఉన్నోడి మీద అనవసరంగా అభాండాలు వేయకూడదు అంటూ నెటిజన్లు ఈ కుర్ర హీరోకు బాగానే సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా కూడా ఛలో సినిమా కథ విషయంలో వచ్చిన కాంట్రవర్సీ ఇప్పుడు విడుదలైన భీష్మ సినిమాతో అందరికీ తెలిసేలా క్లియర్ చేశాడు వెంకీ కుడుముల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here