Home Entertainment Cinema

మహేష్ అభిమానుల కల నెరవేరుస్తున్న వంశీ పైడిపల్లి

మహర్షి సినిమాతో మహేష్ బాబుకు మంచి విజయం అందించాడు వంశీ పైడిపల్లి. ఇప్పుడు తర్వాతి సినిమాను కూడా ఈయనతోనే చేయబోతున్నాడు సూపర్ స్టార్. పైగా సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేసి జోరు మీదున్నాడు సూపర్ స్టార్. ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటికీ బి, సీ సెంటర్స్ లో మంచి వసూళ్లనే తీసుకొస్తుంది సరిలేరు నీకెవ్వరు. మూడో వారం కోసం కొత్త సీన్స్ కూడా యాడ్ చేసారు దర్శక నిర్మాతలు.

ఇదిలా ఉంటే కొన్ని నెలలుగా రెస్ట్ లేని మహేష్.. ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు నెలలు పూర్తిగా హాలీడే ఎంజాయ్ చేసిన తర్వాత మే నుంచి గానీ కొత్త సినిమా మొదలు పెట్టకూడదని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు సూపర్ స్టార్. అందుకే జూన్ నుంచి వంశీ సినిమా ఉంటుందని చెప్పాడు ఈయన. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. ఇందులో మహేష్ బాబు పాత్ర జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రను వంశీ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసాడని తెలుస్తుంది.

కొన్నేళ్లుగా చాలా మంది దర్శకులు మహేష్ బాబును ఆ తరహా పాత్రలో చూపించాలనుకున్నారు కానీ కుదర్లేదు. రాజమౌళి కూడా తనకు మహేష్ తో జేమ్స్ బాండ్ సినిమా చేయాలని ఉందని చెప్పాడు. ఇప్పుడు వంశీ చేస్తున్నాడు. వంశీ కథ చెప్పిన విధానానికి మహేష్ ఫ్లాట్ అయ్యాడని.. అందుకే వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తుంది. మహర్షి విజయం సాధించడంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు కూడా పెరిగిపోయాయి. మహర్షిలో సందేశం ఇచ్చినా ఈ సారి మాత్రం పూర్తిగా యాక్షన్ సినిమాతోనే రాబోతున్నాడు సూపర్ స్టార్. జూన్ నుంచి మొదలుపెట్టి 2021 సమ్మర్ రిలీజ్ కు కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here