Home Entertainment Cinema

దుమ్ము దులిపేస్తున్న శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ బిజినెస్..

ఫిదా లాంటి సెన్సేషన్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా అద్భుతంగా జరుగుతుంది.

షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కానీ అప్పుడే బిజినెస్ మాత్రం పరుగులు తీస్తుంది. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఓవర్సీస్ లో మాత్రం లవ్ స్టోరీకి అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అక్కడ ఈ సినిమాను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 5.5 కోట్లకు కొనేసిందని తెలుస్తోంది. ఇంతకు ముందు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమా ఓవర్సీస్ లో 2 మిలియన్ వసూలు చేసింది. అదికూడా మూడేళ్ల కింద. అందుకే అదే నమ్మకంతో ఇప్పుడు ఈ సినిమాను 5 కోట్లకు పైగా వెచ్చించి తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా.

ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఏషియన్ సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా టీజర్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. మొత్తానికి విడుదలకు ముందే నాగచైతన్య సినిమా బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here