Home Entertainment Cinema

అంతా చూస్తుండగానే జీవితకు వార్నింగ్ ఇచ్చిన వర్మ..

రామ్ గోపాల్ వర్మ అంటేనే కేరాఫ్ సంచలనం. ఈయన ఎప్పుడు ఎవరిని ఎక్కడ అలా టార్గెట్ చేస్తాడో చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. సాధారణంగా ఈయనను తన శిష్యులు కాకుండా బయటి వాళ్ళు సినిమా వేడుకలకు పిలవరు. తాజాగా ఈయన స్టాలిన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు. స్టాలిన్ అంటే చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా కాదు.. తాజాగా తమిళ హీరో జీవా చేస్తున్నది. ట్యాగ్లైన్ అందరివాడు అని పెట్టుకున్నాడు జీవా. రత్న శివ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ కు వచ్చిన రామ్ గోపాల్ వర్మ అక్కడే ఉన్న జీవిత రాజశేఖర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ.. వర్మ చాలా మంచివాడు.. అన్ని నిజాలే చెబుతాడు.. అలా బతకాలని అందరికీ ఉంటుంది కానీ ఎవరు చేయడానికి ధైర్యం చేయరు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది జీవిత. అది విన్న తర్వాత మైక్ అందుకున్న వర్మ ఆమెపై సెటైర్లు కురిపించాడు. ఇందాక మాట్లాడుతూ జీవిత తను చాలా పొగిడిందని.. అయితే అందులో చాలావరకు అబద్ధాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. తన ఇమేజ్ పాడు చేయడానికి జీవిత ప్రయత్నించారని.. స్టేజ్ దిగిన తర్వాత అసలు విషయాలు కింద మాట్లాడుకుందాం అంటూ స్టేజీపైన ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు వర్మ. అయితే అది సరదాగానే చేసాడు.

ఇక స్టాలిన్ సినిమా గురించి మాట్లాడుతూ కొత్త దర్శకులు ఈమధ్య చాలా బాగా ఆలోచిస్తున్నారని.. ఇలాంటి సినిమాలు విజయాలు సాధించాలని కోరుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. మరోవైపు రంగం సినిమా తర్వాత ఇప్పటి వరకు జీవాకు తెలుగులో విజయం రాలేదు. ఆ ఒక్క సినిమా పేరు చెప్పుకుని మళ్లీ మళ్లీ తన సినిమాలను ఇక్కడ విడుదల చేస్తున్నాడు. నవదీప్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here