Home Entertainment Cinema

బాలయ్య పసిబిడ్డ.. క్లారిటీ ఇచ్చిన సంచలన దర్శకుడు..

తెలుగులో బాలయ్యకు ఉన్న ఇమేజ్ గురించి చెప్పనక్కర్లేదు. మాస్ సినిమాలకు ఈయన పెట్టింది పేరు. ఈయన ఇమేజ్ కు సరిపోయే కథ కానీ పడిందంటే ఇప్పటికీ బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకుంటాడు. అంతటి సత్తా ఉన్న మాస్ హీరో ఈయన. బోయపాటి లాంటి దర్శకుడు ఈయనతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు బోయపాటి మాదిరే ఒకప్పుడు బి గోపాల్ కూడా బాలయ్యకు సంచలన విజయాలు అందించాడు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన పల్నాటి బ్రహ్మానాయుడు చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ అయిపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఈ ఒక్క సినిమాతోనే బి గోపాల్ రేంజ్ కూడా చాలా పడిపోయింది. అప్పటి వరకు వరస విజయాలతో దూసుకుపోయిన గోపాల్.. పల్మాటి బ్రహ్మనాయుడు తర్వాత ఖాళీ అయిపోయాడు.

ఇక ఇప్పుడు బాలయ్యతో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. తనకు ఇండస్ట్రీలో అందరు హీరోలతోనూ మంచి స్నేహం ఉందని.. అందులో బాలయ్య ముందు వరసలో ఉంటాడని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. అంతేకాదు.. పల్మాటి బ్రహ్మనాయుడు సినిమాలోని తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సీన్ గురించి కూడా చెప్పాడు. ఈ ఒక్క సీన్ వల్ల తనకు చాలా చెడ్డపేరు వచ్చిందని.. అసలు ఆ సీన్ చేయకుండా ఉండాల్సిందని తర్వాత అనుకున్నట్లు చెప్పాడు గోపాల్. కానీ అప్పటికే జరిగిపోయింది కాబట్టి ఏం చేయలేం కదా అంటూ నిట్టూర్చాడు ఈయన. ఇక బాలయ్య ఏం అనలేదా అంటే పాపం ఆయన పసిబిడ్డ..

అసలు ఒక్క మాట కూడా అనలేదు.. బంగారం అంటూ వెనకేసుకొచ్చాడు బి గోపాల్. బాలయ్యతో పని చేయడం ఎప్పుడూ సంతోషమే అంటున్నాడు ఈ దర్శకుడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన మరో సినిమా చేస్తాడో లేదో చూడాలిక. ఈయన గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన ఆరడుగుల బుల్లెట్ మూడేళ్లుగా విడుదల కాకుండా ఆగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here