Home Entertainment Cinema

సొంత ఓటీటీ చానల్ ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

ఇప్పటివరకు సినిమాల నిర్మాణం,థియోటర్లు,పంపిణీ వ్యవస్థ పైనే దృష్టి పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. గత ఏడాది కాలంగా దీనిపై చర్చ నడుస్తున్నా ఆయన ఆదిశగా ప్లాన్ చేయలేదు. తాజాగా మరోసారి ఆయన డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అల్లు అరవింద్‌కు సంబంధించిన ఆహాలో దిల్ రాజు కూతురు – అల్లుడు భాగస్వామిగా ఉన్నారు. కరోనా కారణంగా థియోటర్లకు దూరమైన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫాంల పై ఆసక్తి చూపుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ ఇండస్ట్రీ సంక్షోభం ఎదుర్కోంటుంది. కరోనా మొదటి వేవ్ నుంచి కోలుకుని మళ్ళీ పుంజుకుంటున్న సమయంలో సినీ థియోటర్లు మూతపడ్దాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్,ఆహా ఓటీటీ,నెట్ ఫ్లిక్స్ కి మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా స్పార్క్ ఓటీటీ మొదలై రికార్డ్ స్థాయిలో సబ్‌స్క్రైబర్స్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు సొంత ఓటీటీ ప్లాన్ చేస్తున్నాడట. డిస్ట్రిబ్యూటర్‌గా, ప్రొడ్యుసర్‌గా దిల్ రాజు మంచి బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు ఉంది. ఇక సొంత ఓటీటీ ప్లాన్ చేస్తుండటంతో డిజిటల్ రంగంలో కూడా ఆయన సత్తా చాటడం ఖాయమని టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. మరి ఏ పేరుతో దిల్ రాజు సొంత ఓటీటీ ప్రారంభిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here