Home Entertainment Cinema

కూతురు నిర్ణయం కోసం దిల్ రాజు ఎదురుచూపులు

దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తున్నాయి. భార్య అనిత మూడేళ్ల క్రితం చనిపోవడంతో ఒంటరిగానే ఉన్న రాజు ఇప్పుడు తోడు కోసం తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ అమ్మాయి చాలా ఏళ్లుగా రాజు గారికి తెలుసని.. వాళ్ళ అమ్మానాన్నలు అమెరికాలో ఉంటారని తెలుస్తోంది. ఈమధ్య ఇండియాకు వచ్చినప్పుడు దిల్ రాజు తన పెళ్లి గురించి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈపాటికి దిల్ రాజు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయేది అంటున్నారు సన్నిహితులు.

కానీ ఈ పెళ్లికి దిల్ రాజు కూతురు నిర్ణయం కోసం అంతా ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సరే అంటే రాజు గారి రెండో పెళ్లికి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే. ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం కాస్త విచిత్రంగా అనిపించినా తోడు కోసం తప్పడం లేదు అంటున్నారు దిల్ రాజు సన్నిహితులు. ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. దాంతో కచ్చితంగా తోడు కావాలి అందుకే మరో పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతి కష్టం మీద ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని అయితే ఆయన కూతురు నిర్ణయంపైనే ఇప్పుడు ఆయన రెండో పెళ్లి ఆధారపడి ఉందని తెలుస్తోంది. కూతురు సరే అంటే వెంటనే ఎలాంటి సందడీ లేకుండా పెళ్లి చేసుకోబోతున్నాడు దిల్ రాజు.

అందుకే ఇప్పుడు ఏం జరగాలి అన్న ది కూడా రాజుగారి కూతురు చేతుల్లోనే ఉంది. అన్నట్లు దిల్ రాజు చేసుకోబోయే అమ్మాయి గతంలో ఎయిర్ హోస్ట్రెస్ గా కూడా పని చేసింది. మరి చూడాలి క దిల్ రాజు రెండో పెళ్లి ఎన్ని మలుపులు తిరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here