Home Entertainment Cinema

దిల్ రాజ్ కి షాద్ నగర్లో రెండో పెళ్లి అయిపోయిందా?

టాలీవుడ్ లో కొన్ని రోజులుగా దిల్ రాజు రెండో పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన తనకు తెలిసిన అమ్మాయి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఆయన సన్నిహితులు మాత్రం ఇది నిజమే అని చెబుతున్నారు. త్వరలోనే దిల్ రాజు మరోసారి ఇంటివాడు కాబోతున్నాడు. అయితే పెళ్లికి ఇంకా టైమ్ ఉందని అంతా అనుకుంటున్న తరుణంలో సడన్ గా ఈయన పెళ్లైపోయిందంటూ వార్తలు వచ్చాయి. 30 ఏళ్ల అమ్మాయిని ఈయన సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడని.. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే షాద్ నగర్ లోని ప్రకాశ్ రాజ్ ఫామ్ హౌజ్ లో దిల్ రాజు పెళ్లి జరిగిందని వార్తలొచ్చాయి.

ముఖ్యంగా ఈయన పెళ్లి గురించి చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మూడేళ్ల కింద ఆయన భార్య అనిత అనారోగ్యంతో కన్నుమూసిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ వయసులో కచ్చితంగా ఆయనకు ఒక తోడు అవసరం అని.. అందుకే రెండోసారి పెళ్లి చేసుకోవాలని కొంత మంది సన్నిహితులు సలహా ఇవ్వడంతో దిల్ రాజు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా పెళ్లి కూడా అయిపోయిందని వార్తలు రావడంతో దిల్ రాజు స్పందించక తప్పలేదు.

ఇదే విషయంపై ఈయన ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోలేదని.. ఒకవేళ చేసుకునే ఉద్ధేశ్యం ఉంటే కచ్చితంగా చెప్పే చేసుకుంటానంటూ క్లారిటీ ఇచ్చాడు. అనవసరంగా ఉన్నవి లేనివి రాసి తన ఇమేజ్ పాడు చేయొద్దంటూ ఆయన మీడియాను కోరాడు. తన గురించి తెలిసిన వాళ్లు కూడా ఇలా రాస్తుంటే బాధగా ఉందంటూ ఈయన ఎమోషనల్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటే కచ్చితంగా చెప్పి చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకుంటానని కన్ఫర్మ్ చేసాడు దిల్ రాజు. అంటే ప్రస్తుతానికి చేసుకోలేదు కానీ చేసుకునే ఆలోచన మాత్రం ఉందని చెప్పాడు ఈయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here