Home Entertainment Cinema

దిల్ రాజుతో అనుష్క పెళ్లి.. స్వీటీ రియాక్షన్ ఇదే..

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా దిల్ రాజు రెండో పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన తనకు తెలిసిన అమ్మాయి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఆయన సన్నిహితులు మాత్రం ఇది నిజమే అని చెబుతున్నారు. త్వరలోనే దిల్ రాజు మరోసారి ఇంటివాడు కాబోతున్నాడు. ముఖ్యంగా ఈయన పెళ్లి గురించి చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మూడేళ్ల కింద ఆయన భార్య అనిత అనారోగ్యంతో కన్నుమూసిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ వయసులో కచ్చితంగా ఆయనకు ఒక తోడు అవసరం అని.. అందుకే రెండోసారి పెళ్లి చేసుకోవాలని కొంత మంది సన్నిహితులు సలహా ఇవ్వడంతో దిల్ రాజు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Anushka Dil Raju

ఈయన పెళ్లి చేసుకోబోయేది హీరోయిన్ అనుష్కను అంటూ కొంతమంది పుకార్లు పుట్టించారు. దీనిపై స్వీటీ కూడా రియాక్షన్ ఇచ్చింది. “నేను పెళ్లి ఎప్పుడు చేసుకున్నా అది మా తల్లిదండ్రులు నిర్ణయించేదే. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. ఇటువంటి వార్తలు మనసుకు చాలా బాధ కలిగిస్తాయి. మరోసారి చెబుతున్నా నేను అరేంజ్డ్ మ్యారేజ్ నే చేసుకుంటా. ఇక ఇటువంటి వార్తలు, పుకార్లు పుట్టించడం ఆపేస్తే మంచిది..” అంటూ కాస్త ఘాటుగానే మీడియాతో రిప్లై ఇచ్చింది జేజమ్మ. ఈ మధ్య నాని నిర్మించిన హిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అనుష్క అక్కడ తన పెళ్లి గురించి మరోసారి మనసులో మాట బయట పెట్టింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇందులో అంజలి, మాధవన్, శాలిని పాండే ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలు అనుష్క మూగ అమ్మాయిగా నటించింది. ప్రస్తుతానికి ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేదు. అయినా అనుష్క ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది. నిశ్శబ్దం తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాను అని చెప్పింది అనుష్క మరోసారి ఇంత పెద్ద బ్రేక్ రానివ్వవు అని వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here