Home News Updates

ఎ పి లో పాఠశాలలలో ఇక డిజిటల్ క్లాసులు

ఎ పి లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇక స్మార్ట్ టి వి లు రేపాటు చేస్తారు. ఇదేదో ఎంటర్టైన్మెంట్ కు కాదు. వాటి ద్వారా డిజిటల్ పాఠాలు బోధిస్తారు .. సో.. ఇక ఎ పి లో పాఠశాలలు డిజిటల్ కాబోతున్నాయి.


ఎక్కడో రాయవేలూరు విట్ లో ఇంజనీరింగ్ క్లాస్ రూమ్స్ అన్ని డిజిటల్ అని చెబితే మన విద్యార్థులంతా పోలో మని అక్కడికి తరలి వెళుతున్నారు ..మరి మనం కూడా స్కూల్ స్థాయి నుంచీ డిజిటల్ పాఠాలు బోధిస్తే చాలు అని ఎ పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక
ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ స్మార్ట్ టీవీలు అమర్చి డిజిటల్ విద్య అమలు చేయాలనే విషయమై జగన్ ప్రభుత్వం చర్చ జరిపిందట .

తన కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సాధ్యసాధ్యాలపై చర్చించారని సమాచారం. రాష్ట్రంలోని 15715 పాఠశాలల పునరుద్ధరణ కు చర్యలు చేపట్టారు.పాఠశాలలను బాగు చేస్తేనే డిజిటలైజేషన్ విధానం అమలుచేసి విద్యార్థులకు అత్యాధునిక పరికరాలతో విద్య అందించాలనే ఉద్దేశంతో స్మార్ట్ టీవీలు పాఠశాలలకు అందించనున్నారు. స్మార్ట్ నాణ్యమైనవి మన్నిక గల వాటిని ఎంపిక చేసి విద్యా సంవత్సరం పున:ప్రారంభంలోపు ఏర్పాటుచేయాలని జగన్ సంబంధిత అధికారులు ఆదేశించారు. అదే విధంగా 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్దతో పాటు పలు కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుకలోని వస్తువులను జగన్ నిశితంగా పరిశీలించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here