
గుంటూరు జిల్లా తాడెపెల్లి మండలం పెనుమాకకు చెందిన ఆశా వర్కర్ మృతిచెందింది. ఈనెల 19న విజయలక్ష్మీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. దీంతో విజయలక్ష్మీ 21వ తేదీన కళ్ళు అస్వస్థతకు గురైంది. వెంటనే తనని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. పేషెంట్‌కి చికిత్స చేస్తున్న వైద్యులు..బ్రెయిన్‌స్ట్రోక్‌తో చనిపోయినట్లు ప్రకటించారు. విషయం తెలుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే విజయలక్ష్మీ మరణించిందని వారు ఆరోపిస్తున్నారు.