Home Entertainment Cinema

దేవ‌దాస్ ట్రైల‌ర్…. నాగార్జున బ్రేకప్ స్టోరీనా….?

నాని, నాగార్జున హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ దేవ‌దాస్. ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన తర్వాత సినిమా పై ఒక అంచనాకి వచ్చేశారు నాగ్ ఫ్యాన్స్.

గతంలో రిలీజ్ చేసిన టీజ‌ర్ లో ఏం లేద‌ని.. అప్పుడు కావాల‌నే మందును ప్ర‌మోట్ చేసార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు చిత్ర‌ యూనిట్. అయితే ఇప్పుడు మందుతో పాటు అన్నీ ముందు చూపుతో ట్రైల‌ర్ లో చూపించాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. ముఖ్యంగా నాని కామెడీ టైమింగ్ సినిమాకు అతిపెద్ద ప్ల‌స్. క‌డుపులు చెక్క‌ల‌య్యే కామెడీ సినిమాలో ఉంటుంద‌ని ట్రైల‌ర్ తో గ్యారెంటీ ఇచ్చేసాడు ద‌ర్శ‌కుడు.

టీజ‌ర్ ప్రేక్ష‌కుల ఊహ‌లు అందుకోలేక‌పోయినా ఇప్పుడు ట్రైల‌ర్ మాత్రం అందుకుంది. నానికి తోడు నాగార్జున కూడా కామెడీ చేసాడు. పైగా మాఫియా డాన్ గా ర‌ప్ఫాడించాడు. ఈ ఏజ్ లో కూడా ఆయ‌న గ్లామ‌ర్ చూసి పిచ్చెక్కిపోతుంది ప్రేక్ష‌కుల‌కు. ట్రైల‌ర్ లో ముఖ్యంగా యాక్ష‌న్ ప్ల‌స్ కామెడీపైనే ఫోక‌స్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఛీర్స్ చెప్ప‌కుండా అలా తాగేసావేంట్రా అంటూ నాగార్జున‌.. నానిని అడిగే సీన్ హైలైట్.

 

నానికి బిగ్‌ బాస్ రియాక్షన్స్ సెగలు ఈ సినిమాలో తాకాయి. ఈ సినిమా విషయంలో నాని పెట్టే ప్రతి పోస్ట్‌పై రిప్లైస్ బిగ్‌బాస్ ప్రేక్షకుల నుంచి ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఇవి చూసిన నాని ఓ పోస్ట్ పెట్టారు. దీంతో పాటు దేవదాస్ ట్రైలర్‌ను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘దేవదాస్’ గురించి నేను పెట్టే ప్రతి పోస్ట్‌పై బిగ్‌బాస్ ప్రేక్షకుల రియాక్షన్స్, రిప్లైస్ చూస్తున్నాను. మా డైరెక్టర్ ఈ వేలోనే ట్రైలర్ స్టార్ట్ చేయాలని భావించారు. దేవదాస్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. మీరంతా నాతో, నాగార్జున సార్‌తో కలిసి ఫన్‌ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.. మీ నాని’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆద్యంతం ఈ ట్రైలర్ ఫన్‌ను జనరేట్ చేసింది.

ఇక 60ల్లో కూడా నాగార్జున రొమాన్స్ అదిరిపోయింది. ట్రైల‌ర్ చివ‌ర్లో త‌ర్వాత ఏమైంది అని నాని అడిగితే.. బ్రేక‌ప్ అని చెప్పే సీన్ కూడా బాగుంది. నాని హాస్పిట‌ల్ కు వ‌చ్చి నాగార్జున చేసే ర‌చ్చే ఈ సినిమా. డాక్ట‌ర్, డాన్ మ‌ధ్య జ‌రిగే స‌ర‌దా సంఘ‌ట‌న‌ల‌నే సినిమాగా తెర‌కెక్కించాడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది ఈ చిత్రం. పూర్తి హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ సినిమాలో విల‌న్ గా వివేక్ ఒబేరాయ్ ను తీసుకోవాల‌ని చాలా ప్ర‌య‌త్నించినా త‌ర్వాత స‌ర్దుకున్నారు. ఇందులో నానికి జోడీగా ర‌ష్మిక‌.. నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్ న‌టించారు. మొత్తానికి చూడాలిక‌.. ఈ ఇద్ద‌రూ క‌లిసి చేసే ర‌చ్చ రేపు థియేట‌ర్స్ లో ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here