Home News Politics

దెందులూరు చింతమనేని అడ్డానేనా…?

పశ్చిమగోదావరిజిల్లాలో పరిచయం అవరసంలేని నియోజకవర్గంగా దెందులూరుకు పేరు. తెలుగు దేశంపార్టీ కంచుకోట. జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఇది అతి ముఖ్యమైయ్యింది కావడంతో పాటు ఎపుడు వార్తల్లో వినిపించే అసెంబ్లీ స్థానం. టీడిపి ఆవిర్భావం తర్వాత ఆపార్టీకి కంచుకోటగా నిలిచింది దెందులూరు. 2009 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చింతమనేని తన నియోజకవర్గంపై పట్టునిలుపుకోవడంలో దిట్ట. ముక్కుసూటి తనం, అనుకున్నపని పూర్తి చేసేవరకు ఎవరిని లెక్కచేయని తత్వం చింతమనేనికి ప్రత్యేకత తీసుకొచ్చింది. ఇక్కడ విపక్ష వైసీపీ నుంచి అభ్యర్ధి ఎవరన్నది ఇంకా ఉత్కంఠంగానే ఉంది. చింతమనేని అంతుచూస్తానంటూ సవాళ్ళు విసిరిన జనసేనాని ఇక్కడ సరైన అభ్యర్ధి కోసం వెతుకులాటలో ఉన్నారు, వైసీపీ పశ్చిమలో పాగా వేసేందుకు జిల్లా మొత్తంపై పెట్టిన ఫోకస్ ఒక ఎత్తయితే దెందులూరు నియోజకవర్గంపై పెట్టిన ఫోకస్ మరోఎత్తుగా కనిపిస్తోంది. చింతమనేని అడ్డాగా ఉన్న దెందులూరులో ఎన్నికల ముంగిట రాజకీయం ఎలా ఉంది…దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

టీడీపీ పార్టీ అవిర్భావించాక 1989,2004 మినహా ప్రతి ఎన్నికల్లో దెండులూరులో టీడీపీదే విజయం. నియోజకవర్గంలో సంక్షేమ పధకాల అమలు, అభివృద్ది కార్యక్రమాల తీరు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించే ఎమ్మెల్యేగా చింతమనేనికి పేరుంది. అనుకున్న పనికోసం ఎంత దూరమైన ఎన్ని విమర్శలు ఎదరయినా పూర్తి చేయడమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శించడంతో ఎమ్మెల్యే కమ్ ప్రభుత్వ విప్ ప్రభాకర్ చుట్టు వివాదాలు చక్కర్లు కొడుతుంటాయి. ఎన్ని వివాదాలు చింతమనేని చుట్టూ ఉన్నా వాటన్నింటికి తన పనితీరు జనంలో ఉండే తత్వం జనంలో క్రేజ్ తీసుకు రావడంతో ప్రభాకర్ కి ఎన్నికల టెన్షన్ ఎపుడు పెద్దగా ఉండదనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడొసారి దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ తరుపున పోటిలో దిగేందుకు సిద్దంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి చింతమనేని ప్రభాకర్ కు ఎమ్మెల్యేగా పోటిచేసే అవకాశం ఇవ్వనుంది టీడీపీ.

దెందులూరులో వైసీపీ విషయానికొస్తే ఎమ్మెల్యే అభ్యర్ధిగా అబ్యయ్య చౌదరి బరిలో దిగబోతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్ పై పోటి చేయాలంటే అంతకు మించి జనంలో తిరిగే సత్తా ఉన్నా నాయకుడు అయితేనే దెందులూరులో మరోపార్టీ జెండా ఎగరేయగలడు. ప్రస్తుతం వైసీపీ నుంచి చింతమనేనిపై పోటిచేయబోతున్న అబ్యయ్యచౌదరి ఆ పార్టీకి కొత్తే అయినా గ్రామలవారిగా నాయకుల్లో,కార్యకర్తల్లో గెలుపుపై నమ్మకం కుదిరేలా మీటింగులు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు. కమ్మసామాజికి వర్గానికే చెందిన వ్యక్తికావడంతో వచ్చే ఎన్నికల్లో చింతమనేనిప్రభాకర్ కు పోటి ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు.

మరో వైపు దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికే నువ్వా నేనా అన్నట్టు ఉన్న రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. హఠాత్తుగా ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును వైసీపీ రంగంలోకి దింపనున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో పార్టీలో గందరగోళం నెలకొంది. వాస్తవానికి బీసీల్లో బలమైన వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి వీలుగా వైసీపీ ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే శేషుబాబు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం, అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ వర్గానికి చెందిన భారీగా ఓట్లు ఉండడాన్ని గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశంలో పితాని సత్యనారాయణకు ప్రాధాన్యత లభిస్తుండగా.. వైసీపీలో ఏ ఒక్కరికి అవకాశం లేదు. అబ్బయ్య చౌదరి ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేస్తున్న తరుణంలో రకరకాల ప్రచారాలు తెరముందుకు రావడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది.

దెందులూరులో జనసేనాని విషయానికొస్తే బలమైన అభ్యర్ధిని పోటిలో దించినా టీడీపీని ఓడించడం కష్టమైన పనే. పైగా టీడీపీ గ్రామగ్రామానా పోలింగ్ బూత్ స్థాయి క్యాడర్ చాలా బలంగా పనిచేస్తుంది. అటువంటి సమయంలో జనసేన పోటిచేసినా ఆస్థాయి నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. మరోపక్క వైసీపీ సైతం బలంగానే కనిపిస్తున్నా ఈరెండు పార్టీలను దాటి విజయం కోసం ప్రయత్నించడం కష్టమైన పనే..ఏది ఏమైన
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ ల మధ్య పోరు రాష్ట్రంలోనే ఆక్తికరంగా జరగబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here