Home News Politics

ఢిల్లీలో రేవంత్ నడిపిన పాలిటిక్స్ ఏంటీ…?

చడిచప్పుడు లేకుండా ఢిల్లీ వెళ్ళిన రేవంత్ ఎవరిని కలిసారు. మూడో కంటికి తెలియకుండా మూడురోజులకు పై దేశ రాజధానిలో ఉన్న ఆయన టార్గెట్ ఏంటి. తనను నమ్ముకుని కాంగ్రెస్ లోకి వచ్చిన వారి టిక్కెట్ల విషయంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారా లేక తన పై జరిగిన ఐటీ,ఈడీ దాడుల వెనకున్న గుట్టు తెలుసుకునేందుకు వెళ్ళారా అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అస‌లు రేవంత్ డిల్లీ ప‌ర్య‌ట‌న ఉద్దేశం ఏంటీ…? రేవంత్ నడిపిన పాలిటిక్స్ ఏంటీ…?

అవును నిజ‌మే రేవంత్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ర‌హ‌స్య పర్యటన జరిపారు. అది కూడా రేవంత్ రెడ్డి డిల్లీ వెళ్లి, వ‌చ్చిన త‌ర్వాత కానీ విష‌యం బ‌య‌ట‌కు రాలేదంటే ఎంత జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకున్నారో అర్ధమవుతుంది. అసలు రేవంత్ పర్యటన వెనకున్న విషయం ఏంటన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లోనే హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలంటే ఎం చేయాల‌న్న దాని పై ఆయ‌న నివేధిక‌లతో వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో భేటీ అయ్యారన్న ప్రచారం నడుస్తుంది.

పెద్ద నేత‌లంతా మ‌హ‌కూట‌మి సీట్ల‌ పంప‌కంపైనే దృష్టిపెట్ట‌డంతో… ప్రచారం, అభ్య‌ర్థుల గంద‌ర‌గోళం అంశాల‌ను ఆయ‌న ప్ర‌ధానంగా పాయింట్ అవుట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక తాను అన్నీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం నిర్వ‌హించేందుకు నేరుగా డిల్లీ ప‌ర్మిష‌నే అడిగి ఉంటారు అని కూడా తెలుస్తోంది. తాను ఏం చేయ‌ద‌ల్చుకున్నారు, పార్టీకి ఎలా ప్ర‌చారం నిర్వ‌హించ‌బోతున్నారు, పెద్ద నేత‌లు ఎక్క‌డెక్క‌డ స‌భ‌ల్లో పాల్గొనాలి, త‌ద్వారా ఎలాంటి మైలేజ్ వ‌స్తుంది… అన్న అంశాలు, తాను చేయించిన స‌ర్వేల ఆధారంగా డిటైల్డ్ రిపోర్టు కాంగ్రెస్ పెద్దలకిచ్చారన్న ప్రచారం ఉంది.

మరో వైపు తన పై జరిగి ఐటీ,ఈడీ రైడ్స్ కి సంభందించిన లొగుట్టు కోసం ఢిల్లీలో రెవంత్ కొన్ని పెద్ద తలకాయలను కలిసినట్లు తెలుస్తుంది. ఈనెల 23న మ‌రోసారి తాను ఐటీ అధికారుల ముందు హ‌జ‌రుకావాల్సి ఉంది. సో, ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న డిల్లీ వెళ్లి ఉండ‌వ‌చ్చ‌న్న‌ది ప్రచారం కూడా జోరుగా ఊపందుకుంటోంది. ఇక తన డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఎన్నిక‌ల సంఘాన్ని కూడా క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, రాష్ట్ర పోలీస్ యాంత్రాంగం స‌రైన ర‌క్ష‌ణ క‌ల్పించ‌టం లేద‌ని కూడా ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.

మొత్తానికి రేవంత్ సైలెంట్ గా జరిపిన ఢిల్లీ యాత్ర పై అటు కాంగ్రెస్ ఇటు గులాబీ పార్టీలోను ఏం జరిగి ఉంటుందన్న దాని పై హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఏదైనా రేవంత్ నోరువిప్పితే కాని అసలు విషయం బయటపడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here