Home News Updates

సమత కేసులో దోషులకు ఉరి!

సంచలనం సృష్టించిన సమత కేసు దోషులకు ఉరిశిక్ష పడింది. ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ మేరకు ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధించింది. షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుమ్ లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.

సమతా కేసు దోషులకు ఉరిశిక్ష విధించడంతో ఆదిలాబాద్ లో పలువురు సంబరాల్లో మునిగితేలుతున్నారు. నవంబర్ 24 న ఎల్లపడ్డారు శివార్లలో వీరు సమత ని అత్యాచారం చేసి హత్యచేశారు దోషులు.

డిసెంబర్ 14న 96 పేజీల ఛార్జ్ షీట్ తయారు చేశారు పోలీసులు. ఇప్పుడు దోషులకు ఉరిశిక్ష పడింది. బాధితులకు సత్వర న్యాయం జరగడానికి కేవలం 62 రోజుల్లో ఈ తీర్పు వెలువడింది. విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం లేఖ రాయడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. నవంబర్ 24 ఉదయం 10 గంటలకు సమతని అత్యాచారం చేశారు. సాయంత్రం 8 గంటలకు ఆమె భర్త పోలీస్లకు ఫిర్యాదు చేశారు. 25 తేదీ సమత మృత దేహాన్ని గుర్తించారు.

ఈ అత్యాచారం కేసులో 27 మంది సాక్షుల్ని కోర్టు విచారించింది. జైనూర్ మండలం ఎల్లా పట్టారు గ్రామంలో ఈ ఘటన జరిగింది .

ఘటన జరిగిన 66 రోజుల వ్యవధిలో తుదితీర్పు రావడం హర్షించదగ్గ విషయం. సమత దోషులకు ఉరిశిక్ష పడటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఆమె భర్త గోపి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here