Home News Politics

దానం కాంగ్రెస్ కి రాజీనామా! ఇక టీఆర్ఎస్ లోకే

దానం కాంగ్రెస్ కి రాజీనామా! ఇక టీఆర్ఎస్ లోకే


మిస్టరీ వీడింది. ఎప్పటినుంచో వస్తున్నా ఊహాగానాలు నిజమయ్యాయి. గ్రేటర్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కాంగ్రెస్ కి రాం రాం చెప్పారు. తన రాజీనామా లేఖని టీపీసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డికి పంపినట్లు ఆయన చెప్పారు.

రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో విలేఖరుల సమావేశం పెట్టి వివరిస్తానని అయన చెప్పారు. దానం గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన పార్టీ తెలంగాణా కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు
చెప్తున్నారు. అయితే తాజాగా పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ గూడు వీడారు. దానం గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు.

దానం తెలంగాణా రాష్ట్ర సమితి లో చేరే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here