Home News

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ పొడగింపు

ఏపీలో ఇప్పటి వరకూ అమలవుతున్న కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా తో పాటు పలు కీలక అంశాల పై ఇవాళ ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిశితంగా చర్చించి మె నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని.. సత్ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పల్లెల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై కమిటీ ప్రధానంగా చర్చించన ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం సుమారు రెండు గంటలకు పైగా జరిగింది. ఏపీలో రేపటితో కర్ఫ్యూ ముగియనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. కరోనా కేసులు మరింతగా పెరుగుతుండటంతో కర్ఫ్యూలో సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ఇక బ్లాక్ ఫంగస్ కేసులను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here