Home Business

ఇండియాలో ఫ్యూచర్‌ క్రిప్టో కరెన్సీదే..!

వర్చ్యువల్ కరెన్సీ బిట్‌కాయిన్‌ దుమ్మురేపుతోంది. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కరెన్సీ అదనంత ఎత్తుకు దూసుకుపోతోంది. నియంత్రణ లేని బిట్‌కాయిన్‌ .. మార్కెట్లను షేక్‌ చేస్తోంది. దీంతో చాలా మంది బిట్‌కాయిన్స్‌తో కరెన్సీ ట్రేడింగ్‌ చేసేందుకు ఆసక్తి చూస్తున్నారు. కంటికి కనిపించని బిట్ కాయిన్ అన్ని దేశాల కరెన్సీలతో ఎక్స్ఛేంజ్‌ చేయొచ్చు . ఏదేశంలోనైనా చెల్లుబాటు అవుతుంది. ఇది ఇంటర్నెట్ లేదా ఫోన్ ద్వారా మార్చుకోవచ్చు.

ఈ బిట్ కాయిన్‌ని బిట్ కాయిన్ మైనింగ్ అనే కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా సృష్టిస్తారు. బిట్‌కాయిన్ మైనింగ్ టెక్నాలజీ ఒక అల్గోరిథమ్.. పజిల్‌ని సాల్వ్ చేసినట్లుగా ఈ అల్గోరిథమ్‌ని సాల్వ్ చేయాలి. అపుడే బిట్ కాయిన్స్ సృష్టించబడతాయి. దీనికి సూపర్ కంప్యూటర్స్ కావాలి. 2018లో ఆర్బీఐ మన బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీని కొనడానికి, అమ్మడానికి వీలు లేకుండా బ్యాంకులకు నిబంధనలు విధించింది. ఆర్బీఐ నిషేధం విధించడంతో మనం దేశంలో చాలాకాలం పాటు క్రిప్టో కరెన్సీ చెలామణి ఆగిపోయింది. కానీ 2020లో సుప్రీం కోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసి బిట్‌కాయిన్‌ని కొని అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చింది. దాంతో చాలా మంది మళ్లీ బిట్‌కాయిన్‌ కొనడానికి కొందరు మొగ్గు చెపుతున్నారు.

బిట్‌కాయన్‌పై ఇండియాలో ఎలాంటి చట్టాలు అందుబాటులో లేవు. బిట్‌కాయిన్‌ని ఎవరు నడిపిస్తున్నారు? ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు అనేది తెలియదు. కనుక ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వాన్ని, పోలీసులని ఆశ్రయించలేం. బిట్ కాయిన్ కొనాలనుకునే ఇన్వెస్టర్లు… లాభపడినా, నష్టపోయినా పూర్తి భాద్యత తమదే అనుకొని రిస్క్ చేయాల్సిందే. క్రిప్టోకరెన్సీ చలామణిలో ముఖ్యమైంది యాక్సెప్టెన్స్. అంటే బిట్‌కాయిన్‌ని ఇచ్చినప్పుడు… వస్తువుకి విలువ కట్టి తీసుకునే వాళ్లు ఉండాలి. లేకపోతే బిట్ కాయిన్ విలువ శూన్యం. క్రిప్టోకరెన్సీలు పరిమిత సంఖ్యలోనే ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి ఆగిపోయాక యాక్సెప్టెన్సీని బట్టే… విలువ కూడా ఆధారపడి ఉంటుంది. మరో ప్రధానమైన అంశం… బిట్‌కాయిన్‌కి ఐడెంటిటీ లేదు. ఈ కారణం వల్ల కొన్ని దేశాలో యాక్సెప్ట్ చేయలేదు.

అయితే మన దేశంలో ఫేస్‌బుక్‌… లిబ్రా అనే క్రిప్టోకరెన్సీని పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ప్రజల్లో అవగాహన వచ్చి యాక్సెప్టెన్స్ వచ్చి… చట్టబద్ధత ఉంటే భవిష్యత్ అంతా క్రిప్టోకరెన్సీ అనడానికి ఏ మాత్రం సందేహం లేదంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here