Home Entertainment Cinema

KGF యశ్‌ను చంపాలనుకున్న క్రిమినల్ ఎన్‌కౌంటర్..

ఏంటి.. KGF యశ్ ను చంపాలనుకున్నారా..? ఎప్పుడు జరిగింది.. ఎందుకు జరిగింది.. అసలెందుకు ఆయన్ని చంపాలనుకున్నారు.. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. కాస్త మీడియాను బాగా ఫాలో అయ్యే వాళ్లకు సరిగ్గా ఏడాది కింద జరిగిన ఓ ఘటన గుర్తుండే ఉంటుంది. కర్ణాటకలో స్లమ్ భరత్ అనే ఓ క్రిమినల్ యశ్ హత్యకు కుట్ర చేసాడు. అయితే టైమ్ బాగుండి అతడి ప్లాన్ ముందే పసిగట్టి పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక KGF సినిమాతో యశ్ అప్పటికే ఇండియన్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఆ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్. అలాంటి స్టార్ హీరోను చంపడానికి కర్ణాటకలో కుట్ర జరిగింది. కారణాలేంటనేది క్లారిటీ లేకపోయినా కూడా ఈ కుర్ర హీరోపై మాత్రం 2019లో హత్యకు కుట్ర మాత్రం జరిగింది.

అప్పట్లో అది పెద్ద సంచలనం కూడా. ఈ కేసుపై చాలా చర్చలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు స్లమ్ భరత్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. ఈ కేసుతో పాటు మరో 50 కేసుల్లో కూడా భరత్ నిందితుడు. కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న భరత్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి కర్ణాటక తీసుకొచ్చారు. 40 ఏళ్లు కూడా లేని భరత్ పై 50కి పైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయంటే మనోడు ఎంత డేంజర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నేరస్థుడే కెజియఫ్ స్టార్ యశ్ హత్యకు ప్లాన్ చేసాడు.

పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం చూస్తుంటే క్రైమ్ సీన్‌‌లో రీ కన్సట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై దాడికి యత్నించాడని.. అందులో ఓ పోలీసుకు బుల్లెట్ కూడా దిగిందని అయితే ఆ సమయంలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడంతో ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. ఆ సమయంలో కాల్పులు జరగడంతో భరత్ పొత్తికడుపులోకి, కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అక్కడ తీవ్రంగా గాయపడిన భరత్‌ను దగ్గర్లోని సప్తగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు. 2019 మార్చి 7న స్లమ్​ భరత్ అతని అనుచరులు కలిసి కెజియఫ్ హీరో యశ్​ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ప్లాన్ పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేసారు.. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇప్పుడు ఇలా హతం అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here