మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలులో ఎన్-440కే వైరస్ ప్రమాదకరంగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని అడ్వకేట్ సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. దీంతో విపత్తు నివారణ చట్టం క్రింద పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. దీంతో ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు. కేసు పై కర్నూలు ఎస్పీ పక్కిరప్ప స్పందించారు.
రేపు చంద్రబాబుకు నోటీస్ ఇస్తామన్న ఎస్పీ..విచారణకు 7 రోజుల్లోగా హాజరు కావాలని కోరుతాం అన్నారు. శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తగిన నిర్ణయం తీసుకుంటారు అని తెలిపారు ఎస్పీ పకీరప్ప. చంద్రబాలు కరోనా వైరస్ పై భయభ్రాంతులకు గురి చేసారని, ఇతర రాష్ట్రాలకు ఏపీ ప్రజలను రాకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.