Home Entertainment Cinema

క్రికెటర్ శ్రీశాంత్‌ బట్టలిప్పిన నికిషా పటేల్….

ఆయన ఎక్కడున్న కెరాఫ్ కాంట్రవర్సీనే క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆపై అతితెలివి పనులతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆయనే కేరళ పేస్ బౌలర్ శ్రీశాంత్… స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన శ్రీశాంత్ తాజాగా మరోసారి అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాడు. బిగ్ బాస్ కంటిస్టెంట్ గా ఉన్న శ్రీశాంత్ షోలో మనసు విప్పిమాట్లాడిన మాటలు హీరోయిన్ నికిషా పటేల్ ధాటికి ముల్లులై గుచ్చుకున్నాయి.

‘మీటూ’ ఉద్యమం ఊపందుకుని బాలీవుడ్ భాగోతాలు ఒక్కోక్కటి బయటికి వస్తున్న తరుణంలో తన ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ శ్రీశాంత్ పై సంచలన ఆరోపణలు చేసింది నికిషా. శ్రీశాంత్ ప్రస్తుతం బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పాత మధుర స్మ్రుతులను గుర్తుకు తెచ్చుకుని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.అంతటితో ఆగక తన సతీమణి భవనేశ్వరికుమారితో పాటు తన గర్ల్‌ఫ్రెండ్స్‌ గురించి కూడా చెప్పుకొచ్చాడు. భువనేశ్వరిని ఏడేళ్లపాటు ప్రేమించి వివాహం చేసుకున్న అని షో లో రివిల్ చేయడంతో పాత లవర్ నికిషా మీడియా సాక్షిగా శ్రీశాంత్ ని ఏకిపారేసింది.

శ్రీశాంత్‌ లో ఉన్న మరో యాంగిల్ బటపెట్టిన నికిషా బ్రేకప్ తర్వాత ఆయన్ను ఏ రోజూ నేను కలవలేదంది. ఆయన తనతో బ్రేకప్‌తో పాటు తన గర్ల్‌ఫ్రెండ్స్ గురించి బిగ్‌బాస్‌లో షోలో ప్రస్తావించాడు. ఏడేళ్లపాటు భువనేశ్వరితో లవ్‌లో ఉన్న ఆయన అనంతరం పెళ్లి చేసుకున్నానని చెబుతున్నాడు.. ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయాను. నాతో ఆయన ఏడాదిపాటు లివింగ్ రిలేషన్‌‌లో ఎందుకు ఉన్నాడు..?. బ్రేకప్ అనంతరం గత ఐదేళ్లుగా నా పనేదో నేను చేసుకుంటూ పోతున్నాను. అసలు ఆయన నాతో ఎందుకు బ్రేకప్ అయ్యారో తెలియట్లేదు.. కానీ ఎందుకు ఇలా చేశారని అడిగితే సమాధానాల్లేని ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి. సరిగ్గా ఈ బ్రేకప్ టైంలో నేను ‘వరదనాయక’ మూవీ షూటింగ్‌లో ఉన్నాను. ఆయన ప్రస్తుతం పెళ్లి చేసుకున్న భార్యతో అప్పట్లో ప్రేమలో ఉండి కూడా నాతో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడని తెలిసింది.

బిగ్‌బాస్‌ షోలో తనకు తానుగా గొప్పలు చెప్పుకోవాలనుకున్న శ్రీశాంత్ నికిషా ధాటికి ఇప్పుడు విలన్ గా మారాడు. గతంలో కూడా శ్రీశాంత్ పలువురితో డేటింగ్‌ అంటూ తిరిగిన ఫోటోలో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఉన్న ఎఫైర్స్ పై ఎప్పుడు స్పందించని శ్రీ ఇప్పుడు మీడియా సాక్షిగా తన బట్టలిప్పేసిన నికిషాపటేల్ కామెంట్స్ పై ఎలా స్పందిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here