Home News

బాలకృష్ణ బాటలో వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. ఓ పక్క మందుల కొరత మరో పక్క ఆక్సీజన్ కొరతతో వేల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.ఈ సమయంలో అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలోని వారి కోసం కొవిడ్ నివారణ మందులను పంపించారు. దాదాపు 3వేల కరోనా మందుల కిట్లను బాలయ్య హిందూపురం పంపారు. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకునేవారికి ఈ మందులు అందించనున్నారు. గత ఏడాది దాదాపు 80 లక్షలు విలువ చేసే మందులు, వైద్య పరికరాలను కరోన మొదటి వేవ్ సమయలో హిందూపురం పంపించారు బాలయ్య.

ఇక రోజా విషయానికి వస్తే… ఇటీవల సర్జరీ చేయించుకొన్న ఆమె.. చెన్నైలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంట్లో ఉంటూనే ఇటీవల కరోనా నియంత్రణ చర్యలపై జూమ్ మీటింగ్ ద్వారా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై దిశానిర్దేశం చేశారు. తాను నేరుగా రంగంలోకి దిగకపోయినా తన భర్తతో కరోనా వైద్య, శానిటైజేషన్ పరికరాలను నియోజకవర్గ ప్రజల కోసం పంపారు రోజా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here