Home News Updates

మేలో కరోనా వేవ్ కాదు..సునామి రాబోతుందా..?

దేశంలో రోజుకు మూడున్నర లక్షల కరోనా కేసులు వస్తున్నాయ్‌. ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రపంచంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు రావడం మాత్రం రికార్డే.. అందుకే ప్రపంచ దేశాలు.. భారత్‌లోని పరిస్థితిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా తీవ్రతను చూసి ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయ్‌..ఓ వైపు దేశంలో రోజుకు మూడున్నర లక్షల కేసులు వస్తుంటేనే..కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందడం లేదు. ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకడం లేదు. ఆఖరికి కరోనాతో చనిపోతే..కాల్చేందుకు కూడా శ్మాశానాల్లో స్థలం లేని దుస్థితి ఏర్పడింది. మునుప్పెన్నడూ చూడని సంక్షోభం మన కళ్ల ముందు కనిపిస్తోంది. వేలాది మంది తమ సొంత వాళ్లను కోల్పోతున్నారు. పరిస్థితి నానాటికి దిగజారుతూ కనిపిస్తోంది. మరి మున్ముందు రాబోయే ఉత్పాతాన్ని ఎలా ఎదుర్కోగలమనేదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

దేశంలో కరోనా పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉందని.. అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నారు. రాబోయేది మరింత తీవ్రంగా ఉంటుందన్నారు. వేవ్‌ కాదు.. సునామీ రాబోతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో మరణాల సంఖ్య మొత్తంగా 2 లక్షలకు చేరువవుతోంది. దీంతో మే నెలలో కొవిడ్‌ ఉద్ధృతి తారస్థాయికి చేరనుందని మిచిగాన్‌ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. భారత్‌లో మే 15 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 8 నుంచి 10 లక్షలకు చేరుతాయని హెచ్చరించింది. మే 23 నాటికి రోజుకు 4,500 మంది మరణించే అవకాశం ఉందని పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ మెట్రిక్స్‌ ఇవాల్యువేషన్‌.. ఐహెచ్‌ఎంఈ కూడా ఇలాంటి హెచ్చరికలే పంపిస్తోంది. మే నెల ప్రారంభంలోనే.. అధికారిక, అనధికారిక లెక్కలతో కలిపి రోజుకు 10 లక్షల కన్నా ఎక్కువగానే కేసులు నమోదవుతాయని అంచనా వేసింది.

మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో మరణాల సంఖ్య అధికంగా ఉండనుందని మిచిగాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 1 నాటికి దేశంలో 6.64 లక్షల కొవిడ్ మరణాలు సంభవిస్తాయని ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది. ఊహించిన దానికంటే అధిక మరణాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నట్లు పేర్కొంది. అమెరికాలో 2020 మార్చి నుంచి 2021 జనవరి 1 వరకు అంచనా వేసిన దానికన్నా 23 శాతం ఎక్కువ మరణాలు నమోదైనట్లు గుర్తుచేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, దిల్లీలో కేసులు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, కర్ణాటకలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయ్‌.

మే 1 నుంచి క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ పోవడం ఖాయంగా కనిపిస్తోంది. పీక్‌ స్టేజ్‌కి చేరితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేం..అఘమేఘాల మీద ఆస్పత్రులు, బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు సదుపాయం భారీ ఎత్తున కల్పించడం కూడా కష్టమే..! ఇప్పుడు ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా..? ఏం చేస్తే.. కరోనా ముప్పు నుంచి తప్పించుకోగలమంటే.. నిపుణులు లాక్‌డౌనే బెటర్‌ అంటున్నారు. దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి కనీసం 400 మంది ఈ వైరస్‌ వ్యాపిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే ఇన్‌ఫెక్షన్‌ రేటు తీవ్రంగా ఉంది. ఈ వైరస్‌ వ్యాప్తికి బ్రేక్‌ వేయాలంటే లాక్‌డౌన్‌ సరైన నిర్ణయమన్న భావనలో కొందరిలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here