Home News

తెలంగాణలో మరోమంత్రి కి కౌంట్ డౌన్ మొదలైందా…!

ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. మరో మంత్రికి కౌంట్ డౌన్ మొదలైందంటూ ఆంగ్లపత్రికలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని రేవంత్ చేసిన ట్విట్స్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని హంపీలో జగదీష్ రెడ్డి కుమారుడి బర్త్ డే పార్టీ సందర్బంగా జరిగిన సంఘటనల ప్రకంపనలు ఇప్పు టీఆర్ఎస్ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి.

మంత్రి జగదీష్ రెడ్డి విషయానికి వస్తే..ఈ రోజు ఓ ఇంగ్లీష్ పేపర్ లో జగదీష్ పై వేటు అని స్టోరీ వచ్చింది. హంపి పార్టీకి మూలపురుషుడు, ఆ పార్టీలో తనపై, తన తన కుటుంబం పై మాటలు, పాటలతో ముప్పేట దాడి జరుగుతున్నా వారించకుండా నిమ్మకునీరెత్తినట్టు ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి పై ఇప్పుడు కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారన్నది ఆ కథనం సారంశం. చినికి చినికి ఈటెలపై వేటు దాకా వెళ్లిన ఈ ఘటనతో రేపో మాపో జగదీశ్ రెడ్డిని కూడా కేబినెట్ నుంచి పక్కన పెడతారన్న చర్చ మొదలైంది.

మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడు బర్త్ డే సందర్భంగా కొద్ది రోజుల క్రితం కర్నాటక రాష్ట్రంలోని హంపిలోని ఒక ఫాంహౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు. తనకు బాగా సన్నిహితులు అనుకున్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో పాటు, కొందరు అధికార ప్రముఖులు,ఈటలతో పాటు కొందరు నేతలు పాల్గొన్నారు. హుషారుగా పార్టీ మొదలైంది… చుక్కా, ముక్కా జోరందుకున్న తర్వాత అసలు సినిమా మొదలైంది. కేసీఆర్ పాలన పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సదరు పురప్రముఖులు మనసులో మాట బయట పెట్టడం మొదలు పెట్టారు.

పాలన పూర్తిగా కుటుంబమయమైపోయిందని…పెత్తనం మొత్తం అయ్యా కొడుకుల దగ్గరే ఉందని కడుపులో ఆవేదనను ఒక్కొక్కరుగా వెళ్లగక్కడం మొదలు పెట్టారు. ఈటెల రాజేంద్ర పై అధిష్టానం కత్తికట్టిన వైనం పై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సమాచారం కేసీఆర్ కి చేరడంతో ఈటల పై వేటు దాక వెళ్లింది. కేటీఆర్‌ను సీఎం చేయడం, ఈటల కొత్త పార్టీ తదితర అంశాలపైనే చర్చించినట్టుగా కథనాన్ని రాశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here